Exhibition ground
-
రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి (ఫోటోలు)
-
సిటీలో నుమాయిష్ సందడి
-
జనవరి 1నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్ : జనవరి 1నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదివారం మీడియాతో వెల్లడించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ.. నుమాయిష్ ఎగ్జిబిషన్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీక అని వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది జరిగిన అగ్రి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తసుకుంటున్నారని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఫైర్ కంట్రోల్ వెహికిల్స్ సులువుగా తిరిగేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. లక్షా 50 వేల లీటర్ల నీటిని నిలువ ఉంచేందుకు రెండు వాటర్ సంపులను, 9 ఎమర్జెన్సీ కిట్స్ మార్గాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను, నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి గ్రౌండ్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అంజనీకుమార్ వెల్లడించారు. -
ఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తులను ఎదుర్కొనే విషయంలో అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారుల సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని తేల్చిచెప్పింది. ఎగ్జిబిషన్ సందర్భంగా అక్కడికి వచ్చే సందర్శకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.. అగ్నిప్రమాదాల నివారణకు ఏం చేయబోతున్నారు.. విపత్తుల నిర్వహణ కింద ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని డీజీపీ, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. అందుబాటులో ఉన్న వివరాలతో ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేశామంటూ ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ దాన్ని ధర్మాసనం ముందుంచారు. జనాలకు చెబుతున్నారా? విస్తృత జన సమూహాలు వచ్చే ఎగ్జిబిషన్ వంటి నిర్వహణకు ఎన్ఓసీ అవసరమా?లేదా? అని ప్రశ్నించింది. అవసరమని శరత్ చెప్పగా.. మరి అఫిడవిట్లో ఎన్ఓసీ అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారని నిలదీసింది. చట్టం కావాలని చెబుతున్న దాన్ని అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారంది. ‘ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగితే ఎగ్జిబిషన్ లోపలి నుంచి బయటకు వెళ్లేందుకు ఎన్ని మార్గాలున్నాయి.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి ద్వారా ఎలా బయటపడాలి.. తదితర ప్రాథమిక సమాచారాన్ని ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాలకు వివరించే ప్రయత్నం చేశారా? ఎక్కడైనా బయటకు వెళ్లే మార్గాల గురించి బోర్డులపై రాశారా? విమానం బయల్దేరిన వెంటనే ఎయిర్‌హోస్టెస్ ప్రతీసారి విమానంలో ఉండే ద్వారాల సమాచారాన్ని ప్రయాణికులకు చెబుతారు. ఎందుకు? అనుకోని ఘటన ఏదై నా జరిగితే వాటి ద్వారా బయటపడటం ప్ర యాణికులకు సులభమవుతుందని. ఎగ్జిబిషన్ విషయంలో ఇలా చేయొచ్చు. కానీ మీరు (అధికారులు) అలా చేయట్లేదంటే మీ విధులు, బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లే.’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఘటన తర్వాత స్పందిస్తారా.. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను మరిం త మెరుగుపరిచామని శరత్ చెప్పారు. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘మనదేశంలో ఇదే సమస్య. దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాతే మేల్కొంటారు. ప్రపంచమంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. మనం మాత్రం ఘటన జరిగాకనే స్పందిస్తాం. ఇలా జరిగాక స్పందిస్తే.. బతుకు దెరువు కోసం ఎగ్జిబిషన్లో దుకాణాలు ఏర్పాటు చేసిన వారి పరిస్థితేంటి? ఘటన వల్ల వారికి జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలి?’అంటూ ప్రశ్నించింది. కోర్టు హాలులో ఉన్న అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని అడిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్ విస్తీర్ణం, అందులో ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజను,్ల ఇతరయంత్రాలు, బయటకెళ్లే గేట్లు, వాటి వెడల్పుఎగ్జిబిషన్కు ఎంత మంది సందర్శకులొస్తారు.. తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. 24 ఎకరాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందని, ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశామని, బయటకెళ్లేందుకు 3 గేట్లు ఉన్నాయని, ఒక్కో గేటు మార్గం 18 అడుగులు ఉంటుందని, సాధారణ రోజుల్లో 30 వేలు, సెలవులు, వారాంతాల్లో 80 వేల వరకు జనం వస్తారని అధికారి వివంచారు. ఓ మోస్తరు పెళ్లి పందిరి వేయాలంటేనే ఎన్ఓసీ తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటిది 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్ఓసీ అవసరమని చట్టం చెబుతోంది. మీరేమో (అధికారులు) ఎన్ఓసీ అవసరం లేదంటున్నారు. చట్టం అవసరమని చెబుతున్న దాన్ని అవసరం లేదని మీరెలా చెబుతారు? చట్ట నిబంధనలను తుంగలో తొక్కడం ద్వారా ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాల భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇంత పెద్ద మైదానంలో ఎగ్జిబిషన్ జరుగుతుంటే.. భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటే.. మీరు ఏర్పాటు చేసేది నాలుగే ఫైర్ ఇంజన్‌లా! దీనిపై నిలదీస్తే మొన్న జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత ఫైర్ ఇంజన్ల సంఖ్యను పెంచామంటారు. మన దేశంలో ఇదే సమస్య. ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాతే మేల్కొంటాం. దుర్ఘటన జరగక ముందే చర్యలు తీసుకోవడం అన్నది ఉండనే ఉండదు. – జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగే ఫైర్ ఇంజన్‌లా! 24 ఎకరాల్లో ఉన్న గ్రౌండ్లో 4 ఫైరింజన్లనే ఏర్పాటు చేయడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ సమయంలో పిటిషనర్ ఖాజా ఐజాజుద్దీన్ స్పందిస్తూ.. ఎగ్జి బిషన్ మూసివేతకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మూసివేత వల్ల పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుకాణాలు పెట్టుకున్న చిరు వ్యాపారులు నష్టపోతారని, వారి వాదనలు వినకుండానే ఎగ్జిబిషన్ మూసివేతకు ఆదేశాలివ్వమంటారా అంటూ పిటిషనర్‌ను నిలదీసింది. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ భారీ అగ్నిప్రమాదం
-
దాండియా జోష్
-
జైంట్ వీల్ ప్రమాదం.. ఒకరు మృతి
సాక్షి, అనంతపురం : అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. జెయింట్‌వీల్ నుంచి రెండు పెట్టెలు విరిగిపడటంతో అందులో కూర్చొన్న ఓ చిన్నారి మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రోబో యానిమల్స్ ఎగ్జిబిషన్లో ఆదివారం రాత్రి జెయింట్‌వీల్ లోంచి రెండు పెట్టెలు విరిగిపడ్డాయి. అవి 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడటంతో అమృత (8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన జ్యోతి, రాధమ్మ, జర్షితి మేరి, గంగాదేవి, వాసుతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హుటాహుటిన సర్వజనాస్పత్రికి తరలించారు. జెయింట్‌వీల్ తిప్పుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, అతడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రజలు దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. -
8, 9 తేదీల్లో చేప ప్రసాదం
♦ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ♦ పూర్తికావస్తున్న ఏర్పాట్లు ♦ అన్ని ప్రభుత్వ శాఖలు పనుల్లో నిమగ్నం ♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్, పోలీస్ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం ఈ నెల 8వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె ప్రారంభమయ్యే సమయంలో బత్తిని కుటుంబీకులు చేప ప్రసాద పంపిణీని చేపడతారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు వీఐపీ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ పంపిణీ కొనసాగుతుంది. రెండు రోజుల ముందే నగరానికి రాక... రెండు రోజుల ముందే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలి వస్తున్నారు. వారికి భోజన వసతులను పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు దాదాపు 1,000 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్వయంగా అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2 లక్షల చేపపిల్లలు సిద్ధం: మంత్రి తలసాని హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాద పంపిణీ పెద్ద ఎత్తున చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాద ఏర్పాట్లను మంగళవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచుతున్నట్లు తలసాని వివరించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కేంద్రాల నుంచి అదనపు బస్సులను నడపాలని ఆదేశించినట్లు చెప్పారు. గురువారం ఉదయం పాతబస్తీలోని బత్తిని సోదరుల ఇంటి నుంచి పోలీస్ ఎస్కార్ట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేప ప్రసాదం సరైన సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూలైన్లలో నిలబడే వారికి వాటర్ ప్యాకెట్లు క్యూలైన్లలో నిలబడే ఆస్తమా రోగులకు కూడా మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా సరఫరా చేయాలని వాటర్ బోర్డ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 1845 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేప ప్రసాదం పంపిణీ మా పూర్వీకుల నుంచి ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్తమా రోగులకు నయం చేసేందుకు 1845 నుంచి ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం. ఈ ఏడాది కూడా దాదాపు 2 లక్షలకు పైగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నాం. – బత్తిని హరినాథ్‌గౌడ్ -
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
- ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు - వెల్లడించిన బత్తిని సోదరులు హైదరాబాద్: ఉచిత చేప ప్రసాదాన్ని జూన్ 8న ఉదయం 6 గంటలకు పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు విశ్వనాథం గౌడ్, హరినాథ్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఉబ్బస వ్యాధి గ్రస్తులకు పాతబస్తీలోని దూద్‌బౌలిలో బత్తిని వంశం ఆధ్వర్యంలో ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం బత్తిని సోదరులు సాక్షితో మాట్లాడుతూ... జూన్ 8న దూద్‌బౌలి లోని తమ నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లక్షలాది మంది చేప మందు సేవించేందుకు విచ్చేస్తారని, వారి కోసం ప్రభుత్వం తరఫు న అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయని బత్తిని సోదరులు తెలిపారు. దూద్‌బౌలిలోని తమ ఇంట్లో 8, 9న చేపమందు పంపిణీ చేస్తామన్నారు. ఈ చేప ప్రసాదాన్ని ఉచి తంగా పంపిణీ చేస్తున్నామని, నకిలీ చేప ప్రసాదం పంపి ణీ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష ఉచిత చేప మందు పంపిణీ కోసం లక్ష చేప పిల్లలను సిద్ధం చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జూన్ 8న నిర్వహించనున్న చేప మందు పంపిణీ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, బత్తిని సోదరులు అందించే చేప మందు కోసం నగరంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. దూర ప్రాంతాల వారి కోసం 110 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు చెప్పా రు. హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడంతో పాటు నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ మైదానానికి చేపల సరఫరా కోసం మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలని, బారికేడ్లను అమర్చాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ తదితరులు పాల్గొన్నారు. -
6 లక్షల మందికి 5 క్వింటాళ్ల చేప ప్రసాదం
చార్మినార్ : చేప ప్రసాదం పంపిణీలో భాగంగా మంగళవారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఏటా చేప పంపిణీ ప్రసాదానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఈ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. పూజా కార్యక్రమాల్లో బత్తిని విశ్వనాథ్ గౌడ్, హరినాథ్ గౌడ్, శివానంద్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్, సంతోష్ గౌడ్లతో పాటు దాదాపు 250 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం తయారీ కార్యక్రమం కొనసాగింది. బుధవారం ఉదయం 4 గంటలకు పూజల అనంతరం 6.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని బత్తిని సోదరులు తెలిపారు. ఈసారి 6 లక్షల మందికి.. గతేడాది 3.5 క్వింటాళ్ల చేప ప్రసాదం పంపిణీ చేశామని... అయితే, అది చాలక పోవటంతో మరో 50 కిలోలను తయారు చేసి పంపిణీ చేసినట్లు బత్తిని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని ముందుగానే తయారు చేస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 34 లైన్లను ఏర్పాటు చేసి ఒక్కో లైన్లో నలుగురు చేప మందు పంపిణీ చేయనుండగా, వారికి మరో నలుగురు సహాయకులుగా పని చేస్తారన్నారు. 24 గంటల్లో మూడు షిప్టులలో తాము ప్రజలకు చేప ప్రసాదాన్ని అందజేయనున్నామన్నారు. ఉచితంగా ఆహారం.. టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షుడు నాగ్నాథ్ మాశెట్టి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం చేప ప్రసాదం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ సైనీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్వేత మెహంతి హాజరయ్యారు. -
చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : మృగశిరకార్తె సందర్భంగా ప్రతియేడు అందజేసే చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బారికేడ్లను నిర్మించి.. చలువ పందిళ్లు, మంచి నీటి ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం ప్రత్యేక బలగాలను నియమించారు. -
సూక్తుల పూల్స్.. హైదరాబాద్ వెల్స్!
మహాభారతం రాయవయ్యా మగడా అంటే... ‘నానా రుచిరార్థ సూక్తి నిధి’ని కాబట్టి దాంట్లో నేను సూక్తులనేకం చెబుతానన్నాడు నన్నయ్య. మాటకు కట్టుబడుతూ ‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక ‘బావి’ మేలు’ అంటూ వాకృచ్చాడు. మరి హైదరాబాద్ ఇంత పెద్ద నగరం. సుట్టుముట్టు సూర్యాపేట దగ్గర్నుంచీ నట్టనడుమ నల్లగొండ వరకూ... హైదరాబాద్‌తో పని ఉండి పోయివచ్చే వాళ్లందరూ ‘ఎక్కడికీ పయానం’ అంటే ‘పట్నం’బొయ్యొస్త అనేవారు. వాళ్లందరి దృష్టిలో పట్నం అంటే హైదరాబాదే. మరి అప్పట్లో సద్ది కట్టుకుని ఆ మూటను నెత్తిన పెట్టుకుని వచ్చేవాళ్లంతా భోజనాల వేళకు కాస్త ముఖమూ, కాళ్లు చేతులూ కడుక్కొని అన్నం తినాలంటే ఏం కావాలి? నీళ్లు! అందుకే... ఆ నీళ్ల కోసమే నుతజల పూరితంబులగు నూతులు కాకుండా... మంచినీటి బావులే బోలెడు తవ్వించారు అప్పటి నవాబులు. ఒక బావి చుట్టూ బొమ్మలూ, విగ్రహాలూ ఉండేవేమో! బొమ్మలను ఉర్దూలో పుత్లే అంటారు కదా. కాబట్టి అలా బొమ్మలతో అలంకరించిన ఆ బావిని ‘పుత్లీ బౌలీ’ అన్నారు. కానీ ఇవ్వాళ్లక్కడ విగ్రహాలూ లేవు, బావీ లేదు. పేరు మాత్రం పదిలంగా నిలిచిపోయింది. ఇక ఇంకో బావిలోని నీరు అచ్చం పాలలా రుచిగా తేటగా ఉండటం చూసి దాన్ని ‘దూద్ బౌలీ’ అన్నారు. ఆ ఏరియాలోనే మొదట్లో మన బత్తిన సోదరులు మొదట్లో చేపమందు ఇచ్చేవారు. తర్వాత జనం ఎక్కువై వేదికను ఎగ్జిబిషన్ గ్రౌండుకు మార్చారు. ఇంకో బావిలో నీళ్లకంటే ఇసుక ఎక్కువ కనిపించేదేమో... దాన్ని పట్టుకుని ‘రేతీబౌలీ’ అన్నారు. రేతీ అంటే ఉర్దూలో ఇసుక కదా. అప్పట్లో వాళ్లు తివిరి ఇసుక నుంచి తైలానికి బదులు నీళ్లే తీసి ఉంటారు. ఇక గచ్చిబౌలీ పేరెందుకు వచ్చిందో తెలియదు గానీ... ఇప్పుడక్కడ నీళ్లకు బదులు అంతర్జాతీయస్థాయి ఐటీ పరిశ్రమలన్నీ నీళ్లూరినట్లు ఊరుతూపోతున్నాయి. బావి అంచుల్ని గచ్చుతో కట్టినట్లుగా అంచులు కూలకుండా నిటారుగా నిలబడి ఉన్నాయి. గచ్చిబౌలీలోని చెలమల్లోంచి నీరూరినట్లుగా ఊరి... కలిమికి చిహ్నంగా చేరి... ఈ బౌలీ ప్రతిష్ఠ చూడూ అంటూ తళతళలాడుతున్నాయి. ఇక ఇక్కడి మరో బావిలోని నీళ్లను తమ అవసరాల కోసం మొట్టమొదటి సారి ఇంజనీర్లు ఇంజిన్‌తో తోడించారట. అందుకే ఆ బావికి ‘ఇంజన్‌బౌలీ’ అని పేరు పెట్టారు. ‘‘ఇలా పుత్లీబౌలీ, దూద్‌బౌలీ, రేతీబౌలీ, గచ్చిబౌలీ, ఇంజన్‌బౌలీ... ఇన్ని బావులెలా తవ్వించారండీ ఈ పాలకులూ? అయినా ఆ నన్నయ్యగారి మాట ఈ నవాబుగార్లకెలా తెలిసిందబ్బా’’ అంటూ నేను అమితంగా ఆశ్చర్యపోతూ అడిగా. దానికి మా గౌరీభట్ల నర్సింహమూర్తి నా వైపు ఒక్క చూపు చూసి చిరునవ్వు నవ్వుతూ... ‘‘ఒరే పిచ్చోడా... ఇదీ నీతి అని చెప్పడానికి ఇతిహాసమైన భారతమైతే ఏమిటీ, ఇస్లాం తాలూకు ఇన్కార్ చేయలేని సూక్తి అయితే ఏమిటీ... నీతి ఎక్కడైనా నీతేరా. ముందు చల్లటి నీళ్లు తాగు. మన ఊరి బావి నీళ్లే’’ అంటూ నాకు ఓ చురక అంటించాడు. -
కీసరలో దేవాదాయ నిర్మాణాల కూల్చివేతకు యత్నం
కీసర: కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆలయానికి సంబంధించిన పలు నిర్మాణాలను ఓ ప్రైవేటు వ్యక్తి కూల్చివేయడానికి ప్రయత్నించడం గురువారం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు స్థలం ఓ ప్రైవేటు వ్యక్తికి చెందినది కావడంతో సమస్య ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర వాణి సమీపంలోని సర్వే నం: 200/4లో దాదాపు 11 ఎకరాల్లో భూమి ఉంది. ఈ భూమిలో ఏటా కీసరగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్, జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు అక్కడ కళా వేదిక నిర్మాణంతోపాటు, భక్తుల సౌకర్యార్థం మినీ తాగునీటి ట్యాంకులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ సర్వే నంబర్లోని ఎనిమిదిన్నర ఎకరాల భూమి బోగారం గ్రామానికి చెందిన చేవూరి రఘునందనరావు పేరిట ఉంది. ఈ స్థలాన్ని వాడుకుంటున్నందుకు పట్టాదారును స్థలదాతలుగా కీసర దేవస్థానం గుర్తిస్తూ వస్తోంది. కూల్చివేతలకు ప్రయత్నించిన పట్టాదారుడు అయితే గురువారం ఈస్థలాన్ని స్వాధీ నం చేసుకునే క్రమంలో పట్టాదారు అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీ సాయంతో పనులు చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ స్థలంలో మోదుగు వృక్షాల చుట్టూ ఉన్న దిమ్మెలను కూల్చివేశారు. ఈ సమాచారాన్ని తహసీల్దార్ రవీందర్‌రెడ్డికి, కీసరగుట్ట దేవస్థానం వారికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ కూల్చివేతలను నిలిపివేయించారు. రికార్డుల ప్రకారం స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందినదైనప్పటికి చాలా ఏళ్లుగా ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ పలు నిర్మాణాలను చేపట్టిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదన్నారు. స్థలం మొత్తం సర్వేచేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని, అంతవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్థలయజమానికి స్పష్టం చేశారు. -
చేప ప్రసాదం సర్వం సిద్ధం
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానం సిద్ధమైంది. నేడు, రేపు(8,9 తేదీల్లో) జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పూర్తి చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ ముఖేశ్ కుమార్ మీనా ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేపప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లక్ష చేప పిల్లలు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగనున్న చేప ప్రసాదం పంపిణీకి లక్ష చేప పిల్లలను అందుబాటులో ఉంచనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అవసరమయితే మరిన్ని చేపపిల్లలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చేప పిల్లలను ఆదివారం ఉదయంలోపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలించేం దుకు ఏర్పాట్లు చేశామన్నారు. ‘ప్రసాదం’ పంపిణీ కోసం 32 కౌంటర్లను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఫిషరీస్ ఫెడరేషన్ ద్వారా ఒక్కో చేప పిల్లను రూ.15లకు విక్రయించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా... చేప ప్రసాదం స్వీకరించేందుకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బస చేస్తున్న వీరికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు లక్షల మందికి ప్రసాదం : హరినాథ్‌గౌడ్ గతేడాది రెండు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశాం. ఈ సంవత్సరం మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో చేప ప్రసాదం సిద్ధం చేస్తున్నాం. 8వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు చేప ప్రసాద పంపిణీ ప్రారంభమవుతుంది. 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. అప్పటికీ చేప ప్రసాదం అందలేని వారికి కవాడిగూడలోని మా స్వగృహంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తాం. వెయ్యిమందితో బందోబస్తు చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అబిడ్స్ ఏసీపీ జైపాల్ తెలిపారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో కలిసి ఎగ్జిబిషన్ మైదానంలో బందోబస్తును పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రసాదం తయారీ షురూ..! చార్మినార్, న్యూస్‌లైన్: చేప ప్రసాదం పంపిణీలో భాగంగా శనివారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామివ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వ్రతం పూర్తి చేశారు. అనంతరం 2.30 గంటలకు బావిపూజ చేశారు. పూజా కార్యక్రమాల్లో బత్తిని హరినాథ్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, దుర్గాశంకర్ గౌడ్, గౌరీశంకర్‌గౌడ్, శివానంద్ గౌడ్, నందుగౌడ్, సంతోష్‌గౌడ్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రసాదం తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద వితరణ సాయంత్రం 4.30కి దూద్‌బౌలీలో మొదటగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 5.20 గంటలకు ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానానికి తరలిస్తారు. నేడు ఉచిత ఆహార పదార్థాల పంపిణీ... ఏపీ బసవ కేంద్రం, హైదరాబాద్, ఏపీ రాష్ట్రీయ బసవ దళ్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం తీసుకోవడానికి వ చ్చే వారందరికి ఉచితంగా ఆహార పదార్థాలను అందిస్తున్నామని ఏపీ బసవ కేంద్రం అధ్యక్షులు నాగ్నాథ్ మాశెట్టి, బసవ దళ్ అధ్యక్షులు ధన్‌రాజ్ జీర్గే తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టీ, బిస్కెట్లు, 11 గంటల నుంచి పూరీ, పులి హోర తదితర ఆహార పదార్థాలను ఉచితంగా అందిస్తామన్నారు. -
రేపు,ఎల్లుండి చేప ప్రసాదం
పంపిణీకి అన్ని ఏర్పాట్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను పరిశీలించిన కలెక్టర్, పోలీసు కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: మృగశిరకార్తె సందర్భంగా ఈనెల 8,9వ తేదీల్లో ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ముఖేష్ కుమార్‌మీనా తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించిన కలెక్టర్.. కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. చేపపిల్లల విక్రయ కేంద్రం, టోకెన్ కౌంటర్లు, పంపిణీ కౌంటర్లు, బారీకేడ్ల నిర్మాణం పనులతోపాటు మహిళలకు, వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు మంచినీటి ప్యాకెట్లను అందజేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపట్టేలా సిబ్బందిని నియమించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు..శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరాపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు జేసీ సంజీవయ్య, బత్తిన హరినాథ్‌గౌడ్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్‌మార్గమ్, హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, పలువురు తహశీల్దార్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ అబిడ్స్: చేపప్రసాదం పంపిణీ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎంకేమీనా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం రాత్రి పర్యవేక్షించారు. ప్రసాదానికి వచ్చే వేలాదిమందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 100 ప్రత్యేక బస్సులు : చేపప్రసాదం పంపిణీ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి సోమవారం రాత్రి రద్దీ ముగిసే వరకు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ లతోపాటు మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 100 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ‘చేపప్రసాదం స్పెషల్- ఎగ్జిబిషన్ గ్రౌండ్’ అనే పేర్లతో సర్వీసులు నడుస్తాయన్నారు. -
ఇదీ ప్రసాదం కథ
చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర తొలినాళ్లలో 50 కేజీలు ప్రస్తుతం 3.5 క్వింటాళ్ల ప్రసాదం వుృగశిర కార్తె సందర్భంగా ఆస్తవూ రోగులకు అందజేసే చేపప్రసాదం పంపిణీ ఈ ఏడాది కూడా ఎగ్జిబిషన్ మైదానంలోనే జరగనుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 9 సాయంత్రం వరకూ ఈ పంపిణీ కొనసాగనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. చేప ప్రసాదం ప్రత్యేకతలపై కథనం. పూజల నుంచి ప్రసాదం తయారీ వరకు... చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు దూద్‌బౌలీలోని బత్తిని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తా రు. అనంతరం చేప ప్రసాదం తయారీని మొదలుపెడతారు. అదే రోజు రాత్రి నుంచి 8వ తేదీ తెల్లవారుజాము వరకు ప్రసాదం తయారీ కొన సాగుతుంది. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద వితరణ, పూజా కార్యక్రమం చేస్తారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు దూద్‌బౌలిలో మొదటగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానానికి తరలిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు (ఈ నెల 9వ తేదీ) సాయంత్రం వరకు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. దూద్‌బౌలిలో ఈ నెల 8,9,10వ తేదీల వరకు పంపిణీ కొనసాగుతుందని బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలకు బత్తిని గౌరీ శంకర్ గౌడ్ (8341824299,93466 96647), సంపత్ (99899 89954) నెంబర్లలో సంప్రదించవచ్చు. 168 ఏళ్ల చరిత్ర... వుృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది ఆస్తవూ రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాతబస్తీ దూద్‌బౌలీలోని తవు స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే దీనిని తయారు చేయడం ఆనవాయితీ. తయారు చేసిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు ముందుగా స్వీకరిస్తారు. మొదట్లో ఈ ప్రసాదాన్ని 50 కిలోల వరకు తయారు చేసేవారు. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లను తయారు చేస్తున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రసాదం మూడు రకాలు... చేప ప్రసాదం మూడు రకాలుగా ఉంటుంది. అవి చేపతో ఇచ్చే ప్రసాదం, బెల్లంతో ఇచ్చే ప్రసాదం, కార్తె ప్రసాదం. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదం 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె ప్రసాదంను మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. చేపతో ప్రసాదాన్ని మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. చేప ప్రసాదం స్వీకరించడానికి రెండు గంటల ముందు వరకు ఎలాంటి ఆహారాన్ని, కనీసం నీటిని కూడా స్వీకరించకూడదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే ప్రసాదం స్వీకరించిన గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోకూడదు. 1996 వరకు పంపిణీ పాతబస్తీలోనే.. ప్రారంభం నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్బౌలీలోనే చేపప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా వేదిక నిజాం కళాశాల మైదానానికి మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం ప్రసాదం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది. -
ముస్తాబవుతున్న ‘నుమాయిష్’
=నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో చకచకా ఏర్పాట్లు =46 రోజుల పాటు విజ్ఞానం, వినోదం =కొలువుదీరనున్న 2500 స్టాళ్లు = మెట్రోరైల్ కోచ్ ప్రత్యేకాకర్షణ అబిడ్స్/అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జంటనగరవాసులు, శివారు ప్రాంతాల ప్రజలను 46 రోజుల పాటు వినోద, విజ్ఞానాంశాలతో అలరించేందుకు నుమాయిష్ ముస్తాబవుతోంది. 74వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల అభివృద్ధికి కేటాయిస్తుంది. కాగా, ఈసారి తొలిసారిగా ఆర్బీఐ, కార్మిక శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. హైదరాబాద్ మెట్రోరైల్ కోచ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. 2500 స్టాళ్లు నుమాయిష్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు దాదాపు 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మన రాష్ట్ర ఉత్పత్తులతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, పిల్లో కవర్లతో పాటు గృహోపకరణాలు, గృహాలంకరణ, మహిళల అలంకరణ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు కొలువుదీరనున్నాయి. పటిష్ట భద్రత ఏటా నుమాయిష్‌ను 22 లక్షల మంది సందర్శిస్తుంటారని సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వనీమార్గం తెలిపారు. ఈసారీ అదేరీతిలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులతో పాటుగా 300 మంది సొసైటీ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది భద్రత విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రతి సందర్శకుడిని మెటల్, హ్యాండ్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తామన్నారు. 25 సీసీ కెమెరాలు, 2 డాగ్‌స్క్వాడ్‌లు, 4 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు పండగే..పండగ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఎమ్యూజ్మెంట్ విభాగం విద్యార్థులు, చిన్నారులను అలరించనుంది. ఇందులో ఏర్పాటు చేసే రంగులరాట్నం, చుక్‌చుక్‌రైలు, సర్కస్, జెయింట్‌వీల్ వంటివి ఆహ్లాదాన్ని పంచనున్నాయి.