జైంట్‌ వీల్‌ ప్రమాదం.. ఒకరు మృతి | Accident At Exhibition Ground In Anantapur | Sakshi
Sakshi News home page

జైంట్‌ వీల్‌ ప్రమాదం.. ఒకరు మృతి

Published Sun, May 27 2018 10:23 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Accident At Exhibition Ground In Anantapur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం : అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. జెయింట్‌వీల్‌ నుంచి రెండు పెట్టెలు విరిగిపడటంతో అందులో కూర్చొన్న ఓ చిన్నారి మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రోబో యానిమల్స్‌ ఎగ్జిబిషన్‌లో ఆదివారం రాత్రి జెయింట్‌వీల్‌ లోంచి రెండు పెట్టెలు విరిగిపడ్డాయి. అవి 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడటంతో అమృత (8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

అలాగే అనంతపురం జిల్లాకు చెందిన జ్యోతి, రాధమ్మ, జర్షితి మేరి, గంగాదేవి, వాసుతేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హుటాహుటిన సర్వజనాస్పత్రికి తరలించారు. జెయింట్‌వీల్‌ తిప్పుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, అతడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రజలు దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement