ఇదీ ప్రసాదం కథ | This is the story of the time | Sakshi
Sakshi News home page

ఇదీ ప్రసాదం కథ

Published Thu, Jun 5 2014 12:38 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఇదీ ప్రసాదం కథ - Sakshi

ఇదీ ప్రసాదం కథ

  • చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర
  •  తొలినాళ్లలో 50 కేజీలు
  •  ప్రస్తుతం 3.5 క్వింటాళ్ల ప్రసాదం
  •  వుృగశిర కార్తె సందర్భంగా ఆస్తవూ రోగులకు అందజేసే చేపప్రసాదం పంపిణీ ఈ ఏడాది కూడా ఎగ్జిబిషన్ మైదానంలోనే జరగనుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 9 సాయంత్రం వరకూ ఈ పంపిణీ కొనసాగనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. చేప ప్రసాదం ప్రత్యేకతలపై కథనం.
     
     పూజల నుంచి ప్రసాదం తయారీ వరకు...
     చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు దూద్‌బౌలీలోని బత్తిని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తా రు. అనంతరం చేప ప్రసాదం తయారీని మొదలుపెడతారు.
     
     అదే రోజు రాత్రి నుంచి 8వ తేదీ తెల్లవారుజాము వరకు ప్రసాదం తయారీ కొన సాగుతుంది.
     
     8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద వితరణ, పూజా కార్యక్రమం చేస్తారు.
     
     అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు దూద్‌బౌలిలో మొదటగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.
     
     సాయంత్రం 5 గంటలకు ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానానికి తరలిస్తారు.
     
     సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు (ఈ నెల 9వ తేదీ) సాయంత్రం వరకు ప్రసాదం పంపిణీ జరుగుతుంది.
     
     దూద్‌బౌలిలో ఈ నెల 8,9,10వ తేదీల వరకు పంపిణీ కొనసాగుతుందని బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలకు బత్తిని గౌరీ శంకర్ గౌడ్
     (8341824299,93466 96647), సంపత్ (99899 89954) నెంబర్లలో సంప్రదించవచ్చు.
     
     168 ఏళ్ల చరిత్ర...
     వుృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది ఆస్తవూ రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాతబస్తీ దూద్‌బౌలీలోని తవు స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే దీనిని తయారు చేయడం ఆనవాయితీ. తయారు చేసిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు ముందుగా స్వీకరిస్తారు. మొదట్లో ఈ ప్రసాదాన్ని 50 కిలోల వరకు తయారు చేసేవారు. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లను తయారు చేస్తున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.
     
     ప్రసాదం మూడు రకాలు...
     చేప ప్రసాదం మూడు రకాలుగా ఉంటుంది. అవి చేపతో ఇచ్చే ప్రసాదం, బెల్లంతో ఇచ్చే ప్రసాదం, కార్తె ప్రసాదం.
     
     2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదం 10 గ్రాములుంటుంది.
     
     30 గ్రాములు కలిగిన కార్తె ప్రసాదంను మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి.
     
     చేపతో ప్రసాదాన్ని మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు.
     
    చేప ప్రసాదం స్వీకరించడానికి రెండు గంటల ముందు వరకు ఎలాంటి ఆహారాన్ని, కనీసం నీటిని కూడా స్వీకరించకూడదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే ప్రసాదం స్వీకరించిన గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోకూడదు.
     
    1996 వరకు పంపిణీ పాతబస్తీలోనే..
    ప్రారంభం నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలీలోనే చేపప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా వేదిక నిజాం కళాశాల మైదానానికి మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం ప్రసాదం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement