Sri Satyanarayana Swamy
-
శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం
-
వరాలిచ్చే స్వామి వరుడైనాడు..
► సత్యదేవుని కల్యాణోత్సవాలు ప్రారంభం ► నూతన వధూవరులుగా స్వామి, అమ్మవారు ► ఛలోక్తులతో అలరించిన ఎదుర్కోలు ఉత్సవం ►నేటి రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ క్రతువు అన్నవరం: రత్నగిరి పెళ్లికళతో తుళ్లిపడుతోంది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపమాలికలతో శోభాయమానంగా భాసిస్తోంది. భక్తవరదుడు సత్యదేవుడు, ఆయన దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవిల దివ్య కల్యాణోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యూరుు. తొలిఘట్టం గా స్వామి, అమ్మవార్లను వధూవరులను చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు, క్షేత్రపాలకులు శ్రీసీతారాములు వెంటరాగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా మండపానికి తోడ్కొని వచ్చారు. ప్రత్యేకాసనాలపై సీతారాములను, వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ నాగేశ్వరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసిన అనంతరం ముత్తయిదువలు పసుపు దంచారు. కాగా స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవాన్ని రాత్రి 7.30 గంటలకు శ్రీరాజా రామరాయ కళావేదికపై నిర్వహించారు. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మ, ఈఓ నాగేశ్వరరావు తదితరులు స్వామి తరఫున, అర్చక స్వాములు కొండవీటి సత్యనారాయణ, ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులు అమ్మవారి తరఫున ఛలోక్తులతో వాదులాడుకోవడం అలరించింది. ఇదీ నేటి కల్యాణోత్సవ క్రమం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు కల్యాణోత్సవం ప్రా రంభమవుతుంది. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రులు, దేవస్థానం తరఫున ఈఓ, టీటీడీ తరఫున ఆ దేవస్థానం ప్రతినిధులు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరపూజ తదితర ఘట్టాల అనంతరం రాత్రి 11 గంటలకు స్వామి తరపున అర్చకస్వామి అమ్మవారి మెడలో మంగళసూత్రధారణ చేయడంతో కల్యాణక్రతువు ముగుస్తుంది. నేటి వైదిక కార్యక్రమాలు తెల్లవారుజామున 3.00 గంటలకు: సుప్రభాత సేవ, ఉదయం 8.00 గంటలకు: చతుర్వేదపారాయణ, 9.00 గంటలకు: అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షావస్త్రధారణ, సాయంత్రం 6.30 గంటలకు: కొండదిగువన శ్రీస్వామి, అమ్మవార్లకు వెండి గరుడ వాహనంపై, శ్రీసీతారాములకు వెండి పల్లకీ మీద ఊరేగింపు, రాత్రి.9.30 గంటల నుంచి కొండపై స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు రత్నగిరిపై శ్రీరాజా వేంకట రామారాయ కళామందిరంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు: పెండ్యాల నాగేశ్వరరావు బృందం భజన, 8 నుంచి 9 గంటల వరకు ఎస్.నాగలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు: పోల్నాటి గోవిందరావు భక్తి ప్రవచనాలు, 6 నుంచి 9 గంటల వరకు: ఆకెళ్ల లక్ష్మీపద్మావతి బృందం కూచిపూడి నృత్యం, అనంతరం శ్రీఅన్నమాచార్య వాగ్గేయ వరదాయిని బృందం కోలాటం. -
ఇదీ ప్రసాదం కథ
చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర తొలినాళ్లలో 50 కేజీలు ప్రస్తుతం 3.5 క్వింటాళ్ల ప్రసాదం వుృగశిర కార్తె సందర్భంగా ఆస్తవూ రోగులకు అందజేసే చేపప్రసాదం పంపిణీ ఈ ఏడాది కూడా ఎగ్జిబిషన్ మైదానంలోనే జరగనుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 9 సాయంత్రం వరకూ ఈ పంపిణీ కొనసాగనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. చేప ప్రసాదం ప్రత్యేకతలపై కథనం. పూజల నుంచి ప్రసాదం తయారీ వరకు... చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు దూద్‌బౌలీలోని బత్తిని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తా రు. అనంతరం చేప ప్రసాదం తయారీని మొదలుపెడతారు. అదే రోజు రాత్రి నుంచి 8వ తేదీ తెల్లవారుజాము వరకు ప్రసాదం తయారీ కొన సాగుతుంది. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద వితరణ, పూజా కార్యక్రమం చేస్తారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు దూద్‌బౌలిలో మొదటగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానానికి తరలిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు (ఈ నెల 9వ తేదీ) సాయంత్రం వరకు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. దూద్‌బౌలిలో ఈ నెల 8,9,10వ తేదీల వరకు పంపిణీ కొనసాగుతుందని బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలకు బత్తిని గౌరీ శంకర్ గౌడ్ (8341824299,93466 96647), సంపత్ (99899 89954) నెంబర్లలో సంప్రదించవచ్చు. 168 ఏళ్ల చరిత్ర... వుృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది ఆస్తవూ రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 168 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాతబస్తీ దూద్‌బౌలీలోని తవు స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే దీనిని తయారు చేయడం ఆనవాయితీ. తయారు చేసిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు ముందుగా స్వీకరిస్తారు. మొదట్లో ఈ ప్రసాదాన్ని 50 కిలోల వరకు తయారు చేసేవారు. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లను తయారు చేస్తున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రసాదం మూడు రకాలు... చేప ప్రసాదం మూడు రకాలుగా ఉంటుంది. అవి చేపతో ఇచ్చే ప్రసాదం, బెల్లంతో ఇచ్చే ప్రసాదం, కార్తె ప్రసాదం. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదం 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె ప్రసాదంను మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. చేపతో ప్రసాదాన్ని మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. చేప ప్రసాదం స్వీకరించడానికి రెండు గంటల ముందు వరకు ఎలాంటి ఆహారాన్ని, కనీసం నీటిని కూడా స్వీకరించకూడదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే ప్రసాదం స్వీకరించిన గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోకూడదు. 1996 వరకు పంపిణీ పాతబస్తీలోనే.. ప్రారంభం నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్బౌలీలోనే చేపప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా వేదిక నిజాం కళాశాల మైదానానికి మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం ప్రసాదం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది.