సుల్తాన్‌బజార్: మహిళా సాధికారత కోసం గత
8 ఏళ్లుగా క్రియేటీవ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టైల్ పితార ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు రమారాటి, వైశాలి ఇనాని, మీనల్ శారద, వినిత బల్దువలు పేర్కొన్నారు. కోఠిలోని కార్యాలయంలో సోమవారం స్టైల్ పితార పోస్టర్‌ను ఆవిష్కరించారు. గృహిణులు వారి ప్రతిభతో తయారు చేసిన ఉత్పత్తులను వారే స్వయంగా స్టాళ్లలో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. సామాజికంగా, ఆధ్యాతి్మకంగా క్రియేటివ్ ఆర్ట్స్ చారిటీ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు రామ్‌కోఠిలోని కచి్చభవన్‌లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ సంఘ సేవకురాలు భగవతి మహేష్ బలద్వా, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్వేత అగర్వాల్ ప్రారంభిస్తారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్యాషన్ డిజైనింగ్, పేపర్ స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్, గేమ్స్, జువెలరీ, హ్యాండీ క్రాప్‌్ట, ఫుడ్ ఐటమ్స్ 100కుపైగా స్టాళ్లలో ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment