కేంద్ర బడ్జెట్ 2025లో ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి 2, 2025 నుంచి ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని (ఐటమ్ కోడ్ 7113-విలువైన లోహం లేదా విలువైన లోహంతో కప్పబడిన ఆభరణాలు, భాగాలు) 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అదనంగా ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక వస్తువులపై సుంకాన్ని 25% నుంచి 5%కు తగ్గించారు.
టారిఫ్ తగ్గింపు ప్రభావాలు
వినియోగదారులకు తక్కువ ధరలు: కస్టమ్స్ సుంకం తగ్గింపు వల్ల ఆభరణాల ధర తగ్గుతుందని, వినియోగదారులకు మరింత చౌకగా అవి లభిస్తాయని భావిస్తున్నారు. ఇది లగ్జరీ ఆభరణాల వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక సుంకాలు తరచుగా ధరలు పెరిగేందుకు దారితీస్తాయి.
దేశీయ డిమాండ్‌కు ఊతం
ఆభరణాలు మరింత చౌకగా మారడంతో దేశీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది దేశీయంగా తయారయ్యే ఆభరణాల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుంది.
తయారీదారులకు లాభదాయం
ప్లాటినం ఆభరణాల తయారీకి ఉపయోగించే వస్తువులపై సుంకాల తగ్గింపు వల్ల తయారీదారులకు పెట్టుబడి ఖర్చులు తగ్గినట్లవుతుంది. ఇది వారి లాభదాయకతను పెంచుతుంది. ఇది మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
మార్కెట్ స్పందన
ఈ ప్రకటన తర్వాత ఆభరణాల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇది ఈ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జువెలర్స్ వంటి కంపెనీలు తమ స్టాక్ ధరల్లో గణనీయమైన లాభాల్లో ట్రేడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment