
సాక్షి, ముంబై: ముంబై శాంతాక్రజ్‌లోని వాకోలా సమీపంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. ఆజాద్‌మైదాన్ మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు వాకోలాలోని సుభాష్ నగర్‌లో ఓ కారులో ఉంచిన డ్రగ్స్‌ను గుర్తించారు. వీటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి వారిని అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేశంలోని వేర్వేరు చోట్ల కొత్త సంవత్సరాది ఉత్సవాలకు సరఫరా చేసేందుకే ఈ డ్రగ్స్‌ను సిద్ధం చేసినట్లుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment