గాంధీనగర్: గుజరాత్ తీరంలో సోమవారం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌తో వెళ్తున్న పాకిస్తాన్‌కు ఫిషింగ్ బోటును గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ డిఫెన్స్ పిఆర్‌ఓ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్‌తో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నారని గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు.
డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
చదవండి: 16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో..
Comments
Please login to add a commentAdd a comment