న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ఆఫీసును సీజ్ చేసి తమను లోపలికి వెళ్లకుండా చేశారని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విటర్‌లో) ఆమె ఒక పోస్టు చేశారు.
Aam Aadmi Party office has been sealed off from all sides. How can access to a national party office be stopped during the Lok Sabha election? This against the ‘level playing field’ promised in the Indian Constitution.
— Atishi (@AtishiAAP) March 23, 2024
We are seeking time with the Election Commission to… pic.twitter.com/wf9VdittvW
ఢిల్లీ నడిబొడ్డున్న ఉన్న తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు సమాన పోరాట వేదిక లేకుండా చేసే బీజేపీ కుట్రలో ఇది భాగమని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన
Comments
Please login to add a commentAdd a comment