టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు జీఎస్‌టీ షాక్ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్‌బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపైను పన్ను చెల్లించలేదని జీఎస్‌టీ ఆరోపించింది. సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులిచ్చింది.