
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్‌లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కారు డ్రైవర్ మహేశ్ వద్ద నుంచి పోలీసులు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు డబ్బులు తరలిస్తుండగా మహేశ్‌తోపాటు మరో ఐదుగురిని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ ఆదేశాలతోనే డబ్బు తరలిస్తున్నట్టు మహేశ్ పోలీసులకు తెలిపారు. భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment