telugu yuvatha
-
మద్యం అక్రమ రవాణా చేస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్
గుంతకల్లు: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయ రాము, అదే పార్టీకి చెందిన చంద్ర పోలీసులకు దొరికారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం గుంతకల్లు టూటౌన్ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లుకు చెందిన తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బోయ రాముతోపాటు అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర ఆదివారం బళ్లారి నుంచి కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుంతకల్లు పట్టణ శివారులోని కొనకొండ్ల రోడ్డులో రైల్వే బ్రిడ్జి వద్ద కారు ఆపి తనిఖీ చేశారు. కారులో 19 బాక్సుల్లో 1,824 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలింపు కోసం ముఠా ఏర్పాటు కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన రాము 2010లో అప్పటి గుంతకల్లు రూరల్ సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఏడాది తర్వాత ఆ పని వదిలేసి, అక్రమ మద్యం రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. గుంతకల్లుతోపాటు గుత్తి, పామిడి పట్టణాలకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేయడానికి ఏకంగా ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. గుంతకల్లులో పేకాట కేంద్రాలను కూడా నిర్వహించేవాడు. తన అక్రమార్జనకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరాడు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మనిషిగా, ఆ పార్టీ నాయకుడు కేసీ హరి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. గత ఏడాది జూన్‌లో విడపనకల్లు మండలం డొనేకల్లు వద్ద పట్టుబడిన రూ.5 లక్షల విలువైన కర్ణాటక మద్యం తరలింపు కేసులోనూ రాము ప్రధాన నిందితుడు. అప్పుడు రాముతోపాటు గుంతకల్లుకు చెందిన టీడీపీ నాయకులు ఆకుల మల్లేష్, మహేష్, చంద్ర, దూద్‌పీరా, నవీన్ దాదాపు 15 రోజులు రిమాండుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ రాములో ఏమాత్రం మార్పు రాలేదు. అక్రమార్జనే ధ్యేయంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. -
చంద్రబాబుకు యువనేత షాక్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేస్తుండగానే ఆయనకు భారీ షాక్ తగిలింది. యువనేత దేవినేని అవినాష్ గురువారం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా టీడీపీ రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్ వైఖరి నచ్చకపోవడంతో వీరు టీడీపీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదని కొంతకాలంగా అవినాష్ అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్లతో పాటు యువ నాయకులు టీడీపీని వదిలివెళ్లడం తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెలలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా కొద్దిరోజుల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ పార్టీలోకి వచ్చేస్తారని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం వ్యాఖ్యానించారు. (చదవండి: చంద్రబాబు ఎంత కష్టపడినా లాభం లేదు) -
టీడీపీకి భారీ షాక్; యువనేత గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీకి తెలంగాణ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సోమవారం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో విమర్శించారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఎంతోగానో తనను బాధించిందని పేర్కొన్నారు. పార్టీకి సిద్ధాంతాలు లేకపోడమన్నది ఆత్మ లోపించడమేనని వ్యాఖ్యానించారు. కాగా, వీరేందర్ గౌడ్ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడైన వీరేందర్ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న ఆయన కల ఇప్పటివరకు నెరవేరలేదు. తన వారసుడిని ఎమ్మెల్యే చేసేందుకు దేవేందర్ గౌడ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2014లో ఉప్పల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి వీరేందర్ భంగపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి అయిష్టంగానే పోటీ చేసి ఓటమి చవిచూశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టిక్కెట్ కోసం ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు మహాకూటమి తరఫున పోటీ చేసినా గెలుపు దక్కలేదు. చాలా మంది సీనియర్ నాయకులు టీడీపీ వదిలివెళ్లిపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ నిస్తేజంగా మారింది. ఈ నేపథ్యంలో వీరేందర్ గౌడ్ కూడా తన దారి తాను చూసుకున్నారు. -
బాబోయ్...సెల్ టవర్ మాకొద్దు
సాక్షి, టవర్‌సర్కిల్: నగరంలోని శ్రీరాంనగర్‌కాలనీలో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ను నెలకొల్పడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నగర అధ్యక్షుడు జెల్లో జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్శిటీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తోరోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెల్‌టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్‌తోపాటు కాలనీవాసులు అనారోగ్యం బారినపడతారన్నారు. అనుమతిని నగరపాలక సంస్థ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య టవర్‌ను ఎత్తేసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సాయిల్ల రాజమల్లయ్య, ఎర్రబెల్లి రవీందర్, బసాలత్‌ఖాన్, గొల్లె అమర్నాథ్, జావీద్, నర్సయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుయువత నాయకుడికి బెయిల్ మంజూరు
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్టై చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ వైజాగ్ యువనేత శ్రీరామినేని రాకేష్‌కు సోమవారం బెయిల్ మంజూరైంది. బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 9న కిడ్నాప్ కేసులో రాకేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 2 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించడంతో అదే రోజు అతడిని జైలుకు తరలించారు. 6 రోజుల అనంతరం అతడికి బెయిల్ మంజూరైంది. వారానికొకసారి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన నేర చరిత్రను తవ్వేందుకు పోలీసులు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. విశాఖపట్నం అర్బన్, నక్కవానిపాలెం పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రీరామినేని రాకేష్ వైజాగ్ తెలుగు యువత శిక్షణ శిబిరాల సమన్వయకర్తగా పని చేస్తున్నాడు. కేబుల్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పరిచయమైన దామోదర్ అనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో రాకేష్ తన బంధుమిత్రుల నుంచి రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో వారు రాకేష్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాకేష్ తనకు హామీ ఇచ్చిన దామోదర్‌ను నిలదీయడమేగాక, తాను ఇచ్చిన డబ్బులకు గాను వ్యవసాయభూమి రాసివ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.2 సాగర్ సొసైటీలో ఉంటున్న తన బాబాయ్ కుమారుడు సుంకు బాలాజీ కుమార్ సంతకాలు పెడితేనే ఆ భూమి వస్తుందని చెప్పాడు. దీంతో రాకేష్ గత నెల 13న తన అనుచరులు ముగ్గురిని కారులో హైదరాబాద్‌కు పంపించి బాలాజీ కుమార్‌ను కిడ్నాప్ చేయించాడు. అనం తరం అతడిని పిడుగురాళ్లకు తీసుకెళ్లి ఓ గది లో బంధించి తీవ్రంగా హింసించాడు. 14న మరో కారులో బాలాజీకుమార్‌ను వైజాగ్ తీసుకెళ్లి అక్కడ బంధించారు. రాకేష్ అక్కడికి వచ్చి వైజాగ్ తన అడ్డా అని తనను ఎవ రూ ఏమి చేయలేరని మీ తండ్రికి ఫోన్ చేసి రమ్మనాలని సూచించాడు. బాలాజీకుమార్ తండ్రి రమేష్‌బాబును కూడా కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బు లాగాలని రాకేష్ పథకం వేశారు. అయితే దామోదర్, రాకేష్‌కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలియడంతో రాకేష్ 15వ తేదీన బాలాజీకుమార్‌ను వదిలి వేశాడు. అప్పటికే తమ బంధీలో ఉన్న బాలాజీకుమార్ నుంచి రాకేష్ బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాడు. బంగారు గొలుసులు, ఉంగరాలు లాక్కున్నాడు. పేటీఎం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు. హైదరాబాద్ తిరిగి వ చ్చిన తర్వాత బాలాజీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 8న వైజాగ్‌లోని తన ఇంటికి వచ్చిన రాకేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్‌చేశారు. మర్నాడు అతడిని రిమాండ్‌కు తరలించారు. కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
గన్‌తో హల్చల్ చేసిన తెలుగు యువత అధ్యక్షుడు
సాక్షి, గుంటూరు: తమ పార్టీయే అధికారంలో ఉందని అహంకారమో లేక తమను ఎవరేం చేస్తారనే ధీమానో తెలియదు కానీ టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అమాయక ప్రజలు, కాంట్రాక్టు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ తుపాకీతో హల్చల్ చేశారు. విద్యుత్ మీటర్ రీడింగ్ తీసేందుకు వచ్చిన యువకుడిపై బెదిరింపులకు దిగారు బాలకృష్ణ. విద్యుత్ మీటర్ బాక్స్‌ను ఇంటి బయట బిగించమన్న యువకుడితో మొదట వాగ్వాదానికి దిగిన బాలకృష్ణ.. ఆపై తుపాకీ గురిపెట్టి ఆ యువకుడిని బెదిరించారు. దీంతో ఒక్కసారి విస్మయానికి గురయినా ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్ లాక్కొన్ని పగలగొట్టారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
తెలుగు యువత నేత రాకేశ్ లీలలెన్నో..!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఓ వ్యాపారి కిడ్నాప్ కేసులో బుధవారం అరెస్టయిన తెలుగు యువత నేత రాకేశ్ బాగోతాలు ఒక్కొక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌తో చనువుగా ఉన్న ఫొటోలు చూపించి నిరుద్యోగుల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. రాకేశ్ అరెస్టు విషయం తెలిసిన బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా నూజెండ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు శ్రీరామినేని రాకేశ్ విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు మంత్రులు, టీడీపీ నాయకులతో పరిచయాలను ఉపయోగించుకున్నాడు. విశాఖ సీతమ్మధార పీ అండ్ టీ కాలనీలో నివసిస్తున్నాడు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్ తెలుసు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ ఇక్కడి నిరుద్యోగులతో నమ్మబలికాడు. ఆయనతో దిగిన ఫొటోలు చూపించాడు. లోకేశ్ ఎంతో ఆప్యాయంగా రాకేశ్‌తో మాట్లాడుతున్న ఫొటోలు కావడంతో నిరుద్యోగులు కూడా నమ్మేశారు. అంతేకాదు మంత్రి గంటా శ్రీనివాస్, పరిటాల శ్రీరామ్ తదితరులతో తాను చనువుగా ఉన్న ఫొటోలు చూపించి వారి నుంచి రూ.కోటి వరకు వసూలు చేశాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్‌ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో.. నిరుద్యోగులను మోసం చేసిన విషయం బయటపడింది. -
తెలుగు యువతకు చెందిన 60 లక్షలు పట్టివేత..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్‌లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కారు డ్రైవర్ మహేశ్ వద్ద నుంచి పోలీసులు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు డబ్బులు తరలిస్తుండగా మహేశ్‌తోపాటు మరో ఐదుగురిని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ ఆదేశాలతోనే డబ్బు తరలిస్తున్నట్టు మహేశ్ పోలీసులకు తెలిపారు. భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. -
2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలి
తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా కందుకూరు: తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందని, 1982కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనతో అర్థమవుతుందని తెలుగుయువత రాష్ర్ట అధ్యక్షుడు, పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి తూళ్ల వీరేందర్‌గౌడ్ విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సుశీలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ చట్టసభల్లో ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం బిల్లును కాదని రాష్ర్ట ప్రభుత్వం 123 జీఓ తీసుకొచ్చి భూములను సేకరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2013 చట్టాన్ని కాదని జీఓ 123 తేవడం చట్టసభలతో పాటు రాజ్యాంగాన్ని, రాష్ర్టపతిని అవమానించడమేనన్నారు. ఇప్పటికే 81 సార్లు కోర్టులు ప్రభుత్వ పాలనపై మొట్టికాయలు వేసినా తీరు మారలేదని ఆయన దుయ్యబట్టారు. బలవంతపు భూసేకరణను అడ్డుకుంటున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వారికి రేషన్ నిలిపివేశారని ఆరోపించారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని వీరేందర్‌గౌడ్ హెచ్చరించారు. ఫార్మాసిటీకి చేపడుతున్న భూసేకరణ 2013 చట్టానికి లోబడే చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున్న ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లన్నసాగర్లో మాదిరి ఇక్కడా రైతులు తిరగబడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 123 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఈ.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముచ్చర్ల సర్వే నంబర్ 288లోని సర్టిఫికెట్దారులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం దారుణమన్నారు. భూములు లేని వారికి మూడు ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పిన సర్కార్.. సర్టిఫికెట్‌దారులను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు జగదీష్‌బాబు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు సంధ్యాసల్మోహన్రెడ్డి, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, పర్వతాలు, సంజీవ, జాన్యానాయక్, సర్పంచ్ కాస నర్సింహా, ఎంపీటీసీ ఎం.నర్సింహా, నాయకులు అచ్చన పాండు, ఎగ్గిడి కృష్ణ, రవిగౌడ్, శేఖర్‌గౌడ్, యాదయ్య, ప్రవీణ్‌నాయక్, రాంరెడ్డి, వెంకటచారి, శాం్యసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
'అమ్మ'పై పోటీకి తెలుగు నాయకుడి సై
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో సీఎం జయలలిత పోటీచేస్తున్న ఆర్కే నగర్ నుంచి ఆమెపై పోటీచేసేందుకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సోమవారం స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గతంలో తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్ధతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. నిర్బంధ తమిళవిద్య ప్రవేశపెట్టడం వల్ల తెలుగువాళ్లు నష్టపోతారని అందుకే ఆ అంశంపై పునరాలోచించాలని ఎన్నిసార్లు వినతిపత్రం కోరినా ఆమె పట్టించుకోలేదని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు తీరుస్తానని జయ హామీ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని తెలిపారు. కేవలం ఆర్కే నగర్ లో లక్షా ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని చెప్పారు. ద్రావిడ పార్టీలు తెలుగు వారి బాగోగుల కంటే వారిని అణగదొక్కే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. మంగళవారం హోసూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు. -
'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'
-
'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో కలకలం రేగింది. తెలంగాణకు సంబంధించిన టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి. మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని తెలుగు యువత అందులో డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నోటీసు బోర్డుల్లో కనిపించిన ఈ ప్రకటనలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కాస్తంత వాక్పటిమ ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు డిమాండ్ చేసి ఉండొచ్చని, లేదా కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
తెలుగు తముళ్ల నయా దండా!
-
తెలుగు తమ్ముళ్ల బ్లాక్మెయిల్.. అరెస్టు
తెలుగునాడు, తెలుగు యువత విద్యార్థి సంఘాలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కళాశాలలు, పాఠశాలలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు వాళ్లపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలుగునాడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులను కర్నూలు జిల్లా పోలీసుల అరెస్టు చేశారు. వారిని రిమాండుకు తరలించారు.