తిరువొత్తియూరు: పన్ను చెల్లించకుండా, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడం వలన సేలంలో బుధవారం ఉదయం మల్టీ ప్లెక్సీ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలో ఎ.ఆర్.ఆర్.ఎస్ మల్టీప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్‌లో ఐదు థియేటర్‌లు నడుస్తున్నాయి. ఈ థియేటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు రూ.30 లక్షలు పన్ను బకాయిపడ్డారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. అయినా కూడా పన్ను చెల్లించక పోవడంతో బుధవారం ఉదయం కార్పొరేషన్ సహాయ కమిషనర్ రాజా, సూరమంగళం మండల సహాయ కమిషనర్ సుందరరాజన్‌ల నేతృత్వంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి థియేటర్లకు సీలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment