కాంగ్రెస్ నాయకుడి కారు నుంచి రూ.కోటి స్వాధీనం | Rs.1 crore seized from Congress leader's car | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నాయకుడి కారు నుంచి రూ.కోటి స్వాధీనం

Published Fri, Aug 8 2014 8:59 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్ నాయకుడి కారు నుంచి రూ.కోటి స్వాధీనం - Sakshi

కాంగ్రెస్ నాయకుడి కారు నుంచి రూ.కోటి స్వాధీనం

తిరువొత్తియూరు: కోవైలో కాంగ్రెస్ నాయకుడి కారులో తీసుకెళ్తున్న రూ. కోటి నగదును ఇన్‌కంటాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోవై కార్పొరేషన్ పోలీసు కంట్రోల్ రూంకు గురువారం సాయంత్రం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. సాయిబాబా కాలనీ పోలీసుస్టేషన్ పరిధికి చెందిన చెక్‌పోస్టు మార్గంగా ఒక వ్యక్తి కారులో రూ. కోటి నగదును తీసుకెళ్తున్నట్టు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తెలిపాడు. దీంతో సాయిబాబా కాలనీ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తీవ్ర నిఘా జరిపారు. వేలట్టుపాళయంలో గౌండమ్మ పాళయం వద్ద కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. కారు లోపల కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఉన్నారు. అతని వద్ద ఉన్న పెట్టెను తనిఖీ చేయగా అందులో రూ. కోటి నగదు ఉన్నట్టు గుర్తించారు.

నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతని పేరు రాధాకృష్ణన్, పీలమేడు కొండసామి వీధికి చెందిన ఇంజినీర్ అని తెలిసింది. కాంగ్రెస్ శాసన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ నగదు గురించి విచారించగా తనకు స్థలాన్ని విక్రయించగా వచ్చిననగదును తీసుకొస్తున్నట్టు రాధాకృష్ణన్ తెలిపారు. కాని అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement