సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ జరుగుతోంది. రాష్ట్ర్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు ఉన్న మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. (మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం!)
పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పేదలకు నాలుగు విడతలుగా ఉచితంగా సరుకులు పంపిణీ చేసింది. (బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది)
తూర్పుగోదావరి: జిల్యావ్యాప్తంగా ఐదో విడత రేషన్ పంపిణీ జరుగుతోంది.మరోసారి బియ్యం, కందిపప్పులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 16.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
కర్నూలు: జిల్లాలో ఐదు విడత ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలోని 2,436 రేషన్ షాపుల్లో 11.91 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరగనుంది. ఈ సారి వలస కార్మికులకు కూడా రేషన్ పంపిణీ చేస్తున్నారు. 2,486 మంది వలస కూలీలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment