సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ కష్టకాలంలో నిరుపేదలకు ‘పైసా’ పరేషాని పట్టుకుంది. కేవలం రూ.1500 ప్రాణాల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కోసం ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు భౌతిక దూరం పాటించకుండా...మండుటెండల్లో సైతం గంటల తరబడి బారులు తీరుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం ఆయా అకౌంట్లలో రూ.1500 జమ చేసింది. వీటిని డ్రా చేసుకోవడం పేదలకు ఇప్పుడు సవాల్‌గా మారింది. ఇక పాతబస్తీలో పరిస్థితి బెంబేలెతిస్తోంది.
నిత్యావసరాల కోసం..
లాక్‌డౌన్ కష్టకాలంలో ఆహార భద్రత (రేషన్) కార్డు లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం..నిత్యావసర సరుకుల కోసం రెండో విడత కూడా రూ.1500 చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు బ్యాంక్ అకౌంట్ లేని వారిని గుర్తించి పోస్టాఫీసుల్లో జమ చేసింది. మూడు నెలలు సరుకులు డ్రా చేయని లబ్ధిదారులకు మాత్రం నగదు నిలిపివేసింది. బ్యాంక్ అకౌంట్ గల వారికి బ్యాంక్‌ల్లో విత్‌డ్రా ఫామ్‌ల ద్వారా, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఆహార భద్రత కార్డు నెంబర్ ఆధారంగా నగదు పంపిణీ చేస్తోంది. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఏటీఎం కార్డు లేని నిరుపేదలు బ్యాంకుల ముందు నగదు కోసం పోటెత్తుతున్నారు.
పోస్టాఫీసుల ద్వారా..
మహా నగరంలో ఆహార భద్రత కార్డులు కలిగి అకౌంట్‌లేని కుటుంబాలు సుమారు లక్షన్నరపైనే ఉన్నాయి. వారికి నగదు నగదు పోస్టాఫీసుల్లో జమ కావడంతో నగరంలోని సుమారు 24 పోస్టాఫీసుల ద్వారా చెల్లింపు కొనసాగుతోంది. బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారుల జాబితా ఆధారంగా పోస్టల్ శాఖ తాత్కాలిక ఆన్‌లైన్ అకౌంట్లను తెరిచి నగదు చెల్లింపులు చేపట్టింది. రేషన్ కార్డు నెంబర్ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ ఆధార్ గుర్తింపుతో నగదు చెల్లింపులు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత ఏప్రిల్ నెల చెల్లింపు ఇంకా కొనసాగుతుండగా, రెండో విడుత మే నెల నగదు కూడా పోస్టాఫీసుల్లో జమ చేశారు. వీటి చెల్లింపులకు కూడా పోస్టల్‌శాఖ సిద్ధమైంది.
అందని నగదు..
మహా నగర పరిధిలోని సుమారు 4.18 లక్షల పేద కుటుంబాలకు నగదు లబ్ధి నిలిచిపోయింది. సమచారం తెలియక నిరుపేద కుటుంబాలు బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో కలిపి ఆహార భద్రత కార్డులు కలిగిన 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. అందులో సుమారు 25 శాతం వరకు వివిధ కారణాలతో వరుసగా సరుకులు డ్రా చేయకుండా అడపాదడపా డ్రా చేస్తుంటారు. అందులో అత్యధికంగా మేడ్చల్‌లో 1.54 లక్షలు, రంగారెడ్డిలో 1.38 లక్షలు, హైదరాబాద్‌లో 1.26 లక్షల పైచిలుకు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా మూడు నెలలు సరుకులు డ్రా చేయని పేద కుటుంబాల్లో సగానికి పైగా గత నెల ఉచిత బియ్యం డ్రా చేసినా.. బ్యాంక్ ఖాతాలో నగదు జమ మాత్రం పౌరసరఫరాల శాఖ నిలిపివేసింది. ఈసారి రెండో విడత నగదు జమ కూడా నిలిపి వేసింది.
నగదు జమ తెలుసుకోవడం ఇలా...
ఆహార భద్రత కార్డు దారులకు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం అందించే నగదు బ్యాంక్, లేదా పోస్టాఫీసులో జమ అయిందా లేదా అనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులోని ఈ–పోస్ పోర్టల్‌లోకి వెళ్లి ‘ఈఆఖీ ఖ్ఛటఞౌnట్ఛ ్ట్చ్టuటఖ్ఛఞౌట్ట‘ క్లిక్ చేయాలి. అందులో రేషన్ కార్డు నెంబర్ టైప్ చేస్తే నగదు ఏ బ్యాంక్, ఎవరి అకౌంట్‌లో లేదా పోస్టాఫీసులో జమ జరిగిందో స్టేటస్ తెలుస్తోంది. అదేవిధంగా పోస్టాఫీసుల్లో సైతం తన నగదు జమ జరిగిందా లేదా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఠీఠీఠీ.్ట్ఛ ్చnజ్చn్చఞౌట్ట్చ ఛిజీటఛి ్ఛ.జీn వెబ్‌సైట్‌లోకి వెళ్లి రేషన్ కార్డు నెంబర్ టైప్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment