
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 67.85 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు 2 లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగిలో 58 శాతం ధాన్యం కొనుగోలు చేశామని.. మహబూబ్‌నగర్, నల్గొండలో 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. మూడు రోజుల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో కూడా 8 కోట్ల 14 లక్షల గన్నీ సంచులు సమకూర్చుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment