188 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత | Police catch the Ration Rice in Nellore | Sakshi
Sakshi News home page

188 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

Published Fri, May 5 2017 3:42 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

188 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత - Sakshi

188 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

► ఐదుమంది అరెస్ట్‌  
 
కావలిరూరల్‌ : అక్రమంగా తరలిస్తున్న 188 బస్తాలు రేషన్‌ బియ్యాన్ని కావలి ఒకటో పట్టణ ఎస్సై గుంజి అంకమ్మరావు గురువారం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి గురువారం రేషన్‌ బియ్యంతో లారీ వస్తోందని తెలుసుకున్న సీఐ ఎం.రోశయ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. లారీ పట్టణంలోని లక్ష్మి మోడ్రన్‌ రైస్‌మిల్లులోకి ప్రవేశిస్తుండగా పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు.

లారీకి పైలెట్‌గా వ్యవహరిస్తున్న కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం తరలింపులో భాగస్వామ్యం ఉన్న మధురెడ్డి, ఎస్‌కే షఫీ, పోలయ్య, సురేష్, కోటేశ్వరరావులను అదుపులోనికి తీసుకున్నారు. బియ్యంను పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించి లారీని, కారును ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ రోశయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement