సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హేమంత్ బోర్కడే
కుమరం భీం: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అ ధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్– స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. బృందాలను నియోజకవర్గాల వారీగా విభజించి విధులు కేటాయించామన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రత్యేక వీడియో సర్వేయలెన్స్ టీం నియోజకవర్గంలో జరిగే ర్యాలీలు, బహిరంగ సభలు, ఎన్నికలకు సంబంధిత అంశాలను వీడియో రికార్డింగ్ చేస్తుందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 1950, 08733279411 నంబర్లతో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే అధికంగా నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన మద్యం తరలిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఎంసీఎంసీ బృందం దినపత్రికలు, టీవీ చానళ్లు, మొబైల్ సందేశాలు, సోషల్ నెట్‌వర్క్‌లపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో ఎంసీఎంసీ అనుమతి పొందాలన్నారు. ప్రతిరోజూ ఫ్లయింగ్ స్క్వాడ్ నివేదికలు అందించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment