అధికారులు, నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు, విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను కలెక్టర్ నిర్దేశించారు.
ఎన్నికలు సజావుగా , ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహాకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
గ్రామ స్థాయి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై ఉన్న రాతలను వెంటనే తొలగించేందకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్టీలు గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతులు లేకుండా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రచార ఖర్చుల లెక్క పక్కా..
ఎన్నికల ప్రచార ఖర్చు గరిష్ట పరిమితిని రూ.40 లక్షలుగా నిర్ణయించినట్లు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల కోసం, తాత్కాలిక ఎన్నికల కార్యాలయం, లౌడ్ స్వీకర్ల. హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు హెలిప్యాడ్‌లకు ప్రతి సబ్ డివిజన్‌లో ప్రతి ఆర్‌ఓ స్థాయిలో ఉంచబడిందన్నారు.
ఆప్లికేషన్ వివరంగా పూర్తి ఆకృతిలో చేయాలని, తద్వారా ఖర్చు గణన సులభం అవుతుందని, హైటెక్ డిజిటల్ ఎన్నికల ప్రకటన అండ్ ఎల్‌ఈడీ స్క్రీన్ స్థిరంగా ఉండేలా ప్రామాణిక రేట్లు వర్తించబడతాయన్నారు.
సమావేశంలో వ్యయ నోడ్‌ల్ అధికారి కోదండరాములు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సలీం, వినయ్‌మిత్ర, వెంకట్రామరెడ్డి, రఘురామయ్య గౌడ్, సుదర్శన్‌రెడ్డి, ఎండి అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.50వేల నగదుతో పట్టుబడితే సీజ్
చెక్‌పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని, రూ.50 వేల కంటే పైబడి నగదుతో పట్టుబడితే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. షాడో రిజిస్టర్ పెట్టాలని, సర్వేలైన్ టీం రికార్డ్ చేయాలన్నారు. ఈసమావేశంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీపీఓ మురళీ, అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రణను నిబంధనల ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ యాజమానులు నిర్వహించాలని.. లేదంటే ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో కలెక్టర్ మాట్లాడారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా , సెల్‌ఫోన్ నంబర్లు ప్రింట్ లైన్‌లో స్పష్టంగా సూచించాలని, ముద్రించబడిన ప్రతులను మూడు అదనపు ప్రింట్‌లతో పాటు ప్రింట్ చేసిన మూడు రోజుల్లోపు ప్రచురణ కర్త నుంచి కలెక్టర్ కార్యాలయం నందు ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 127(ఏ) ప్రకారం పంపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment