
సాక్షి, హైదరాబాద్: రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సబ్సిడీ బియ్యం పంపిణీని నిలిపివేసి, ఆ స్థానంలో నగదు బదిలీ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తక్షణం విరమించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.
ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి, బ్లాక్‌మార్కెటింగ్ పేరుతో రేషన్ దుకాణాలను రద్దు చేసి లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలన్న ఆలోచన సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment