రేషన్‌షాప్ డీలర్‌షిప్ కోసం తమ్ముళ్ల ఒత్తిళ్లు
ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నాయకులు
నేరుగా రంగంలోకి దిగిన ఓ సీనియర్‌నాయకుడు
తల పట్టుకుంటున్న అధికారులు
జమ్మలమడుగు: శాశ్విత ప్రతి పాదికన డీలర్ షాపులకు అభ్యర్థుల ఎంపికకు పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో అధికార పార్టీ నాయకులు తమ వారికే డీలర్‌షిప్ దక్కాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎం చేస్తారో తెలియదు మా వాడు పరీక్షలు సక్రమంగా రాకపోయిన టాప్ 3లో ఉండేవిధంగా చూడాలంటూ ఒత్తిడి తెస్తుండటంతో రెవెన్యూ అధికారులు తల పట్టుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని 153 డీలర్‌షాపులకు 703 దరఖాస్తులు చేసుకోగా వారికి ఆదివారం ప్రొద్దుటూరు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజిలో పరీక్ష నిర్వహించారు. అందులో పరీక్షల్లో 80 మార్కులకు, 20 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటారుు. ప్రస్తుతం ఒక దశ పూర్తి కావడంతో ఆర్డీఓ కార్యాలయంలో పరీక్షలు రాసిన అభ్యర్ధుల మార్కుల జాబితా తయారు చేసి నోటీసు బోర్డుపై ఉంచారు. దీంతో రాజకీయ నాయకులు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. పరీక్షల్లో అత్యల్యంగా వచ్చిన వారిని ముందువరుసలో పెట్టాలంటే తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లేలా ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలోని అధికార పార్టీకి చెందిన ఓసీనియర్ నాయకుడు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
తమ నియోజకవర్గంలో కేవలం తాము చెప్పిన వారికే డీలర్ షాపులు దక్కాలని హుకుం జారీచేయడంతో పాటు మార్కులు రాకున్నా తమ అభ్యర్ధులను టాప్ త్రీలో పెట్టి ఇంటర్వ్యూకు పిలువాలంటూ పేర్కొనడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి పులివేందుల ప్రాంతంలో త మ వారికే డీలర్‌షాపులు వచ్చేలా చూడాలని తమ్ముళ్లు చెప్పడం అధికారులకు ఇబ్బందిగా తయూరైంది. ఒక్కో షాప్‌కు అత్యధిక మార్కులు సంపాదించిన వారిలో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేస్తామని, ఒకే మార్కులు వచ్చినప్పుడు మొత్తం నలుగురిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలుపుతున్నారు. ఈనెల 4వతేదీ పులివేందుల, మైదుకూరు, 6వతేదీ జమ్మలమడుగు, 8వతేదీ ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఎలాగైనా తమవారికే దక్కించుకోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు ఒత్తిడి తీసుకొని వస్తుండటంతో చివరికి అధికారులు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
పైరవీ షురూ!
Published Tue, Feb 3 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement
Advertisement