గంటలో 45 కార్డుల సరుకులు కొట్టేశాడు! | Ration Dealer Fraud in One Hour 45 Cards Goods Hyderabad | Sakshi
Sakshi News home page

గంటలో 45 కార్డుల సరుకులు కొట్టేశాడు!

Published Fri, Jul 24 2020 8:40 AM | Last Updated on Fri, Jul 24 2020 9:10 AM

Ration Dealer Fraud in One Hour 45 Cards Goods Hyderabad - Sakshi

కుషాయిగూడ: రేషన్‌ షాపునకు చెందిన సుమారు 45 రేషన్‌ కార్డుల సరుకులను మరో రేషన్‌ డీలర్‌ ఒకే రోజు గంట వ్యవధిలో కొట్టేసి హైటెక్‌ మోసానికి పాల్పడ్డాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ బాధితుడు  వాయిస్‌ క్లిప్పింగ్‌ను వాట్సాప్‌లో షేర్‌ చేయడంతో ఈ విషయం వైరల్‌ అయింది.  చిన్న చర్లపల్లికి చెందిన 3302105 నంబర్‌ రేషన్‌ షాపు డీలర్‌ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.....ఇతని షాపునకు చెందిన 45 రేషన్‌ కా ర్డుల నుంచి ఈ నెల 20న ఒకే రోజు గంట వ్యవధిలో మరో డీలర్‌ స రుకులన్నీ కొట్టేశాడు.

శంకర్‌ ఈ విషయాన్ని పసిగట్టలేదు. పోర్టల్‌ సిస్టమ్‌లో ఎవ్వరు ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చనే భావనలో ఉన్నా డు. అయితే ఈ నెల 22 ఎస్‌ఓటీ పోలీసులమంటూ వచ్చిన కొందరు నీ రేషన్‌ షాపునకు చెందిన 45 కార్డుల నుంచి  ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రేషన్‌ డీలర్‌ సరుకులు కాజేశాడని, అసలు ఏం జరుగుతుందంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న శంకర్‌ తనకు ఎలాంటి సంబంధం లేదని, సరుకులు కొట్టేసిన విషయం కూడా మీ ద్వారానే తెలిసిందని చెప్పాడు.  ఈ విషయంపై డీఎస్‌ఓ స్పందిస్తూ.. జరిగిన ఘట న తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement