గుడిబండ : రేషన్ షాపుల కేటాయింపులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తాళలేని గుడిబండ తహశీల్దార్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడం తో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చేర్పించా రు. పరిస్థితిలో మెరుగుదల లేకపోవడంతో రెండ్రోజులు గా అతను కోమాలో ఉన్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళి తే... రాష్ర్టంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులు దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా గుడిబండ తాలూకాలోనూ తమ పార్టీ మద్దతుదారులకే రేషన్ షాపులు ఇవ్వాలంటూ తహశీల్దార్ వేణుగోపాల్‌పై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. ఈ నేపథ్యం లోనే డీలర్లు కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకున్నారు. దీంతో పాత డీలర్లతోనే డీడీలు తీసుకుని స్టాక్ రిలీ జ్ ఇవ్వాలంటూ తహశీల్దార్‌ను పెనుకొండ ఆర్డీఓ రామ్మూ ర్తి ఆదేశించారు. ఆ మేరకు తహశీల్దార్ వ్యవహరించి స్టాక్ రిలీజ్ చేశారు. ఈ నెల 2న స్టాక్ పాయింట్ నుంచి నిత్యావసర సరుకులతో మండలంలోని మోరుబాగిల్ గ్రామానికి లారీ చేరుకుంది. విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు లారీని అడ్డుకున్నారు. సరుకులు దించకుండా తమ పర్యవేక్షణలోనే నిత్యావసరాలను పంపిణీ చేస్తామని భీస్మించారు.
విషయం తెలుసుకున్న తహశీల్దార్ అదే రోజు రాత్రి ఏడు గంటలకు మోరుబాగిల్ చేరుకున్నారు. అప్పటికే తహశీల్దార్‌పై ఆగ్రహంతో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఆయనను చూడగానే దురుసుగా వ్యవహరిస్తూ దాడికి సైతం యత్నించారు. సకాలంలో సీఐ హరినాథ్ అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్ది, సమస్య పరిష్కారమయ్యేంత వరకూ నిత్యావసర సరుకులను వీఆర్వో ఆధీనంలో ఉం చేలా చర్యలు తీసుకున్నారు. అంతకు ముందే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న తహశీల్దార్ ఈ సంఘట నతో భయపడి అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల 8వ తే దీ వరకూ జిల్లా కేంద్రంలో చికిత్సలు నిర్వహించినా ఫలి తం లేకపోవడంతో సోమవారం సాయంత్రం ఆయనను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికెళ్లిన తర్వాత అతని పరిస్థితి మరింత విషమించి కోమాలో వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం పై దళిత నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన అధికారి కావడంతోనే అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు తెగించారంటూ మండిపడుతున్నారు. తహశీల్దార్‌కు ఏమైనా జరిగితే రాష్ర్ట వ్యాప్త ఆందోళనలకు సిద్ధపడతామంటూ ఈ సందర్భంగా దళిత సంఘం నా యకులు ఎల్.కె.నరసింహులు, నరసయ్య, ఈరలక్కప్ప, కదిరప్ప, లింగరాజు తదితరులు హెచ్చరించారు.
కోమాలో గుడిబండ తహశీల్దార్?
Published Thu, Dec 11 2014 1:51 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement