పాట్నా: చౌక ధరల దుకాణాల కేటాయింపులోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు సవరణ చేసింది. దీని ప్రకారం కేటాయింపుల్లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 1%, చాలా వెనుకబడిన తరగతులకు 18%, బీసీలకు 12%, బీసీ మహిళలకు 3% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ఆహార, విని యోగదారుల సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ లాలన్ ప్రసాద్ సింగ్ తెలిపారు. ఈ రిజర్వేషన్లు సబ్ డివిజన్ స్థాయిలో అమలవుతాయని పే ర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయితీలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, వికలాంగులు, నిరుద్యోగులకు కేటాయిం పుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. అన్ని కులాల వారికి రేషన్ దుకాణాల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్లు తేనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే.
బీహార్‌లో రేషన్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు
Published Sat, Jan 10 2015 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement