కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గోవర్ధన్‌రావు అనే డీలర్ ఆధ్వర్యంలోని దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా... స్టాక్ రిజిస్టర్, కీ రిజిస్టర్‌లో తేడాలున్నట్టు గుర్తించారు. 23 క్వింటాళ్ల బియ్యం నిల్వలతోపాటు, పంచదార, కిరోసిన్ నిల్వల్లోనూ లెక్కలు సరిపోలలేదు. దీంతో వినియోగదారులను మోసగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ ను అదుపులోకి విచారిస్తున్నారు.