cheks
-
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
దేవరకొండ : సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే స్థానికంగా బాధితులకు అందించారు. చందంపేట మండలం గాగిళ్లాపురానికి చెందిన లక్ష్మికి రూ. 10వేలు, కంబాలపల్లికి చెందిన సతీష్‌కు రూ. 22,500 చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు, జాన్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, బుయ్య మహేశ్, వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త్య బాలు, బషీర్, సురేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పగడ్బందీగా చెక్కుల పంపిణీ
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ‘రైతుబంధు’ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 208 గ్రామాల్లో 1,27,733 మంది రైతుల వద్ద ఉన్న 2,56,730 ఎకరాలకు రూ. 100కోట్లకు పైగా విలువ గల 1,28,280 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మే 10న చెక్కుల పంపిణీ, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 17వ తేదీకల్లా వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలు అత్యంత భద్రత ప్రమాణాలతో ఉన్నాయన్నారు. చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి పథకం ప్రతి రైతుకి అందుతుందని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో విశ్వాసం పెంచాలన్నారు. పంపిణీ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలన్నారు. పంపిణీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్, గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులు తమ సందేహాలను, సమస్యలను గ్రీవియెన్స్ సెల్లో అందిస్తే రెండురోజుల్లో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారులు వారికి వెంటనే సమాధానాలు అందించాలని, గ్రీవియెన్స్ సెల్లో విధులు నిర్వర్తించే వారికి ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, తాగునీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, గ్రామాల్లో చెక్కుల పంపిణీ కోసం అనువైన వేదికలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ తేదీ, సమయం, వేదిక, తదితర అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి రైతులకు పంపిణీ చేయాలని, ఏ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసేది వారికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. సుదీర్ఘ అనుభవమున్న అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 300 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామని, ఆ బృందాల్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఒక నమూనా తయారు చేయాలన్నారు. దాని ప్రకారం అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం నంబరు చెక్కుపై ఉంటుందని, ఆ వివరాలు, రైతుల ఆధార్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. అధికారులు చెక్కు, పాస్ పుస్తకం పంపిణీ చేసేటపుడు లబ్ధిదారుని వద్ద నుంచి రెండు ప్రింటెడ్ రశీదులపై సంతకాలు తీసుకోవాలని, రూ. 50వేలలోపు వరకు ఒక్క చెక్కు, ఆపై పెట్టుబడి సాయానికి రెండు చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం వదులుకునే వారి చెక్కులను రైతు సమన్వయ సమితుల అకౌంట్‌కు అందజేయాలన్నారు. రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బ్యాంకులకు రూ. 6వేల కోట్లు విడుదల చేసిందన్నారు. చెక్కుల అకౌంట్ బుక్‌ను బ్యాంకులు నిర్వహించాలన్నారు. చెక్కులపై ఉన్న పేర్లలో పొరపాట్లను పాస్‌పుస్తకం పరిశీలించి నగదు అందించాలని, లోన్, క్యాష్ కటింగ్ వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బ్యాంకర్లను హెచ్చరించారు. తహసీల్దార్లు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, సాదా బైనామా దరఖాస్తులు ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, రెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో బైరం పద్మయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫార్మసీ షాపుల్లో శనివారం డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీఐలు రెండు బృందాలుగా విడిపోయి పట్టణ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలో సుమారు 180 వరకు ఔషధ దుకాణాలు ఉన్నాయి. కాగా, తమ తనిఖీల్లో భాగంగా కొన్ని షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్టు, ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేందిచనున్నట్టు అధికారులు తెలిపారు. -
చెక్కుల్లో అంకెలు మార్చేస్తూ..
సెక్యూరిటీ సంస్థ పేరుతో భారీ మోసం రూ.5.87 కొల్లగొట్టినట్లు తేల్చిన పోలీసులు హెచ్ఎండీఏ అడ్మిన్ అధికారి హస్తం మోసాన్ని బట్టబయలు చేసిన ఓయూ పోలీసులు అంబర్‌పేట: చెక్కుల్లో అంకెలు మార్చేస్తూ హెచ్ఎండీఏకు రూ.కోట్లలో టోపీ పెట్టిన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన ఉద్యోగి, హెచ్ఎండీఏలోని ఓ అధికారి నిర్వాకం కారణంగా దాదాపు రూ.5.87 కోట్లు దారిమళ్లాయి. ఇటీవల చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌కు అనుమానం రావడంతో మోసం బట్టబయలైంది. శుక్రవారం అంబర్‌పేటలోని ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వి.రవీందర్ ఈ మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. హెచ్ఎండీఏ సంస్థ నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో భద్రత కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న సాయి సెక్యూరిటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని నెలనెలా డబ్బులు చెల్లిస్తుంది. ఈ సంస్థలో 2008లో బోడుప్పల్‌కు చెందిన శంకర్‌నాయక్ ఫీల్డ్ ఆఫీసర్‌గా చేరాడు. విధుల్లో భాగంగా హెచ్ఎండీఏ సంస్థ సాయిసెక్యూరిటీ సంస్థకు చెల్లిస్తున్న నెలవారి చెక్కులను తీసుకువచ్చేవాడు. కొన్నాళ్ల తరువాత సులువుగా డ బ్బులు సంపాదించాలనే ఆశతో పక్కా ప్రణాళిక వేశాడు. వెంటనే సాయి సెక్యూరిటీలో ఉద్యోగం మానేశాడు. అయినా హెచ్ఎండీఏ చెల్లిస్తున్న డబ్బులను నమ్మకంతో సాయి సెక్యూరిటీ సంస్థకు అందిస్తూ వస్తున్నాడు. హెచ్ఎండీఏ సంస్థలో శేరిలింగంపల్లికి చెందిన ఎల్చూరి విజయ్‌మోహన్‌కృష్ణ అడ్మిన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ చెక్కులు జారీ చేస్తాడు. ఇతనితో పాటు నల్లకుంట అచ్చయ్యనగర్‌కు చెందిన రాజు, హామీద్ లకు పథకం వివరించి సాయి సెక్యూరిటీ సంస్థ పేరిట ఖాతా తెరిచారు. అనంతరం హెచ్ఎండీఏ జారీ చేసిన చెక్కులపై ఉన్న అంకెలను మారుస్తూ వీరు తెరిచిన ఖాతాలో జమ చేసి చెక్కు క్లియర్ కాగానే...ఎక్కువగా మార్చిన సొమ్మును వీరు తీసుకుంటూ... అసలైన చెక్కు సొమ్మును సాయి సెక్యూరిటీ సంస్థకు ఎవరికి అనుమానం రాకుండా చెల్లిస్తూ వస్తున్నారు. ఇలా వీరు గత 8 ఏళ్లుగా నిరాటంకంగా మోసానికి పాల్పడుతూ రూ. 5.87 కోట్లు కొల్లగొట్టారు. కాగా ఈ మోసాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఎండీ అన్వర్ హమీద్ ఈ నెల 15వ తేదీన ఓయూ పోలీసులకు రూ. 1.28 కోట్ల నేరం మోసం జరిగినట్లు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఓయూ ఇన్స్పెక్టర్ వి.అశోక్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేసి మొత్తం రూ. 5.87 కోట్లు మోసం జరిగిందని తేల్చారు. దీనికి బాధ్యులైన శంకర్‌నాయక్, ఎల్చూరి విజయ్‌మోహన్‌కృష్ణ, రాజు, హమీద్‌లను వారి ఇళ్ల వద్ద గురువారం రాత్రి అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. కేసును సవాల్‌గా తీసుకొని మోసాన్నిగుట్టు రట్టు చేసిన ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత సిబ్బందిని డీసీపీ అభినందించారు. అంతే కాకుండా రివార్డు కూడా అందిస్తామన్నారు. భారీగా సొత్తు స్వాదీనం.. శంకర్‌నాయక్ నుంచి రూ. 9.75 లక్షల నగదు, 8 లక్షలు బంగారు అభరణాలు, రూ. 3.73 కోట్ల విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, 60 లక్షలు విలువ చేసే ఖరీదైన కార్లు, రూ. 5 లక్షలు విలువ చేసే ఇన్సూరెన్స్ బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌మోహన్ కృష్ణ వద్ద నుంచి రూ. 20.79 లక్షల నగదు, 25 లక్షల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాజేసిన మొత్తంలో 86 శాతం రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అనంతరం ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. -
ఆయిల్ మిల్లులో తనిఖీలు
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులోని వీరభద్ర ఆయిల్ మిల్లును గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆయిల్ నమూనాలను సేకరించారు. మిల్లులో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎన్‌వో తెలిపారు. నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు. -
రంగారెడ్డి జిల్లాలో ఎస్వోటీ తనిఖీలు
మైలార్దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి- శాస్త్రిపురంలోని ఓ గోడౌన్‌పై ఎస్ఓటీ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఓ డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
లాలాపేట: ఉస్మానియా యూనిర్సిటీలో గురువారం నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్ట్‌వల్ దృష్ట్యా ఓయూ సమీపంలోని తార్నాక, లాలాపేట తదితర ప్రాంతాలలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెస్ట్‌వల్ ను అడ్డుకుంటామని కొన్ని సంస్థలు ముందే ప్రకటించిన నేపధ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగ కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లాలా పేట ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి ఆ మార్గంలో వెళుతున్న వారిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. -
ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లను ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వనరులను వినియోగించుకుని, సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నిరుపయోగంగా ఉన్న పెద్దాపురం ఆర్టీసీ భవన సముదాయాన్ని కల్యాణమంటపం, గోదాములుగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పంచాయితీరాజ్ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
అనకాపల్లి : విజయనగరం జిల్లా భోగాపురంలో పంచాయతీరాజ్ డీఈ మల్లా వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఇటీవల వెంకటకృష్ణాజీ అనే డీఈ ఇంటిపై ఏసీబీ దాడుల జరిపిన సందర్భంగా లభించిన డాక్యుమెంట్లలో వెంకట్రావు పేరు కూడా ఉండటంతో ఆ మేరకు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కూకట్‌పల్లిలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్వాతంత్య్రదినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కూకట్పల్లి పీఎస్ పరిధిలోని షాపింగ్‌మాల్స్, సినిమా హాల్స్‌లో ఈ తనిఖీలు చేశారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ డాగ్స్వ్కాడ్స్తో తనిఖీలు నిర్వహించారు. -
రేషన్ దుకాణంపై విజిలెన్స్ దాడులు
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గోవర్ధన్‌రావు అనే డీలర్ ఆధ్వర్యంలోని దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా... స్టాక్ రిజిస్టర్, కీ రిజిస్టర్లో తేడాలున్నట్టు గుర్తించారు. 23 క్వింటాళ్ల బియ్యం నిల్వలతోపాటు, పంచదార, కిరోసిన్ నిల్వల్లోనూ లెక్కలు సరిపోలలేదు. దీంతో వినియోగదారులను మోసగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ ను అదుపులోకి విచారిస్తున్నారు. -
దాబాపై పోలీసుల దాడి
నల్లగొండ : అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసులు దాడి చేశారు. జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గుంటూరు రహదారిలో ఉన్న గోకుల్ దాబాలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాబాపై సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 158 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు దాబాల్లో 10 గంటల తర్వాత అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. అయినా, నోటీసులను ఖాతరు చేయకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మిర్యాలగూడ) -
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆకస్మకి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వలి, జంగారెడ్డి గూడెం లోని హాస్టళ్లను అధికారులు తనిఖీలు చేశారు. హాస్టళ్లలోని వసతులు, నిర్వహణ తీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి, సీజ్ చేశారు. -
రొయ్యల హేచరీలలో కమిషనర్ తనిఖీలు
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని రొయ్యల హేచరీలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తనిఖీలు చేశారు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం చుట్టుపక్కల ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనుమతి లేని హేచరీలపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.