చూడటానికి ఇది ట్రాలీ సూట్‌కేసులా కనిపిస్తుంది గాని, నిజానికిది పోర్టబుల్ పవర్‌స్టేషన్. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఇంట్లో వాడుకోవడానికే కాకుండా, బయటకు తీసుకుపోవడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది.
అమెరికన్ కంపెనీ ‘గోల్ జీరో’ ఇటీవల సూట్‌కేసు పరిమాణంలోని పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘యతి 6000 ఎక్స్’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని మూడు రకాలుగా చార్జ్ చేసుకోవచ్చు. దీనికి సౌరఫలకాలను ఏర్పాటు చేసినందున నేరుగా సూర్యరశ్మి ద్వారా దీనిని చార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఇతర పరికరాలకు మాదిరిగానే గోడకు అమర్చిన ప్లగ్‌బోర్డు ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.
కారులో ప్రయాణించే సమయంలో కారులోని అడాప్టర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఇది 6000 వాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. దీన్ని ఆన్ చేసుకుంటే, 2000 వాట్ల విద్యుత్తును సరఫరా చేయగలదు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులనైనా వాడుకోవచ్చు. ‘యతి–2.0’ యాప్ ద్వారా దీని చార్జింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. దీని ధర 5999.95 డాలర్లు (రూ.4.92 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment