sutcase
-
సూట్కేస్లాంటి పవర్ స్టేషన్
చూడటానికి ఇది ట్రాలీ సూట్‌కేసులా కనిపిస్తుంది గాని, నిజానికిది పోర్టబుల్ పవర్‌స్టేషన్. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఇంట్లో వాడుకోవడానికే కాకుండా, బయటకు తీసుకుపోవడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘గోల్ జీరో’ ఇటీవల సూట్‌కేసు పరిమాణంలోని పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘యతి 6000 ఎక్స్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని మూడు రకాలుగా చార్జ్ చేసుకోవచ్చు. దీనికి సౌరఫలకాలను ఏర్పాటు చేసినందున నేరుగా సూర్యరశ్మి ద్వారా దీనిని చార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఇతర పరికరాలకు మాదిరిగానే గోడకు అమర్చిన ప్లగ్బోర్డు ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. కారులో ప్రయాణించే సమయంలో కారులోని అడాప్టర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఇది 6000 వాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. దీన్ని ఆన్ చేసుకుంటే, 2000 వాట్ల విద్యుత్తును సరఫరా చేయగలదు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులనైనా వాడుకోవచ్చు. ‘యతి–2.0’ యాప్ ద్వారా దీని చార్జింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. దీని ధర 5999.95 డాలర్లు (రూ.4.92 లక్షలు). -
భార్య దారుణ హత్య
చంద్రగిరి: అనుమానం ఓ మహిళ ప్రాణం తీసింది. మృతదేహాన్ని రెండుగా ఖండించి సూట్ కేసులో పెట్టి భాకరాపేట ఘాట్‌రోడ్డులో పడేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి పోలీసుల కథనం మేరకు... కలికిరికి చెందిన సురేంద్ర కుమార్(33) నాలుగేళ్ల క్రితం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లాడు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన కర్నూలుకు చెందిన వినీత(28)తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నెల్లూరు 4వ టౌన్ పోలీసు స్టేషన్లో పరిధిలో కాపురం పెట్టారు. వీరి కాపురం నాలుVó ళ్లు సజావుగా సాగింది. ఈ క్రమంలో వినీత వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో భర్త ఆమెను మందలించాడు. అయినప్పటికీ మార్పు లేకపోయింది. మూడు రోజుల క్రితం సురేంద్రకుమార్ భార్య గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని రెండు ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి చంద్రగిరి మండలంలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేశాడు. తన భార్యను హత్య చేశానని పేర్కొంటూ నెల్లూరు 4వ టౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. నెల్లూరు పోలీసులు శనివారం అతనితో కలిసి భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేసిన వినీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై చంద్రగిరి పోలీసులను వివరణ కోరగా నెల్లూరుకు చెందిన మహిళను ఆమె భర్త హత్యచేసి భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేసిన విషయం వాస్తవమేనన్నారు.