Published
Sun, Oct 2 2016 12:34 AM
| Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
చంద్రగిరి: అనుమానం ఓ మహిళ ప్రాణం తీసింది. మృతదేహాన్ని రెండుగా ఖండించి సూట్ కేసులో పెట్టి భాకరాపేట ఘాట్‌రోడ్డులో పడేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి పోలీసుల కథనం మేరకు... కలికిరికి చెందిన సురేంద్ర కుమార్(33) నాలుగేళ్ల క్రితం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లాడు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన కర్నూలుకు చెందిన వినీత(28)తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నెల్లూరు 4వ టౌన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో కాపురం పెట్టారు. వీరి కాపురం నాలుVó ళ్లు సజావుగా సాగింది. ఈ క్రమంలో వినీత వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో భర్త ఆమెను మందలించాడు. అయినప్పటికీ మార్పు లేకపోయింది. మూడు రోజుల క్రితం సురేంద్రకుమార్ భార్య గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని రెండు ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి చంద్రగిరి మండలంలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేశాడు. తన భార్యను హత్య చేశానని పేర్కొంటూ నెల్లూరు 4వ టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. నెల్లూరు పోలీసులు శనివారం అతనితో కలిసి భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేసిన వినీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై చంద్రగిరి పోలీసులను వివరణ కోరగా నెల్లూరుకు చెందిన మహిళను ఆమె భర్త హత్యచేసి భాకరాపేట ఘాట్ రోడ్డులో పడేసిన విషయం వాస్తవమేనన్నారు.