Portable Grill: పోర్టబుల్‌ గ్రిల్‌.. చికెన్‌, మటన్‌ అన్నింటికీ.. ధర 6,131 | Portable Grill: How It Works And Price Details | Sakshi
Sakshi News home page

Portable Grill: పోర్టబుల్‌ గ్రిల్‌.. చికెన్‌, మటన్‌ అన్నింటికీ.. ధర 6,131

Published Sat, May 21 2022 2:56 PM | Last Updated on Sat, May 21 2022 3:03 PM

Portable Grill: How It Works And Price Details - Sakshi

ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేవి నోరూరించే పసందైన రుచులే. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు.. అలాంటి రుచులను అందిస్తూ ఆ సందర్భాన్ని అమృత జ్ఞాపకంగా మిగిల్చేదే.. ఈ లగేజ్‌ స్టయిల్‌ పోర్టబుల్‌ గ్రిల్‌. దీన్ని మన లగేజ్‌తో పాటు వెంట తీసుకెళ్తే చాలు, రుచుల పంట పండినట్లే. ఇందులో ఎలాంటి వంటైనా నిమిషాల్లో రెడీ అవుతుంది.

చికెన్, మటన్‌ వంటి వాటినీ  రకరకాలుగా గ్రిల్‌ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా టోస్ట్‌ చేసుకోవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ మెషిన్‌ని ఓపెన్‌ చేసుకోవడం, క్లీన్‌ చేసుకోవడం చాలా సులభం. ఇది చూడటానికి సూట్‌కేస్‌లా ఉంటుంది. మేకర్‌ ముందు భాగంలో రెండు రెగ్యులేటర్స్‌ ఉంటాయి. ఇది గ్యాస్‌ సాయంతో పనిచేస్తుంది. చిన్న గ్యాస్‌ సిలెండర్‌ని కూడా సెట్‌ చేసుకోవచ్చు. గ్రిల్‌ ప్లేట్స్‌ మార్చుకోవచ్చు.

ఈ మేకర్‌ లోపల రెండు స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపొందిన గ్యాస్‌ స్టవ్‌లు అమర్చి ఉంటాయి. దీని మూత ఒకవైపు మేకర్‌కి అటాచ్‌ అయ్యుంటుంది. దాంతో సూట్‌కేస్‌ను తెరిచినట్లుగా ఓపెన్‌ చేసుకోవచ్చు. తేలికగా అటూ ఇటూ కదపడానికి ఒకవైపు రెండు చక్రాలు ఉంటాయి. మరోవైపు డివైజ్‌ మొత్తాన్ని పట్టుకునే హ్యాండిల్‌ ఉంటుంది. అదే మెషిన్‌ నిలబడటానికి స్టాండ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇరువైపులా కూరగాయలు కట్‌ చేసుకోవడానికి, ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకోవడానికి స్పెషల్‌ ప్లేట్స్‌ అమర్చి ఉంటాయి. 

ధర - 80 డాలర్లు (రూ.6,131) 

చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement