న్యూఢిల్లీ: కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ....."వారంతా అధికారం కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు. అధికారాన్ని పొందడం గురించే ఆలోచిస్తారు.
నేను అధికార కేంద్రంలోనే పుట్టాను కానీ నాకు నిజాయితీగా దానిపై ఆసక్తి లేదు . నేను నా దేశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కీలక కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాతయ్య, నానమ్మ, తండ్రి కూడా ప్రధానులుగా సేవలందించిన సంగతి తెలిసిందే.
అలాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రా కూడా భారత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నవారే. అంతేకాదు ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ యూపీ సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన బీఎస్సీ అధినేత్రి మాయవతి పై విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఎలాంటి ఎఫర్ట్ పెట్టి పనిచేయలేదని ఆరోపించారు. ఈసారి ఆమె దళితుల కోసం పోరాడలేదని విమర్శలు గుప్పించారు.
(చదవండి: ఆప్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్ తీరువల్లే..)
Comments
Please login to add a commentAdd a comment