
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇతర పార్టీల గురించి ఆందోళన చెందడం మాని సొంత పార్టీని చక్కదిద్దుకోవాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి సలహా ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో మాయవతికి సీఎం పోస్ట్ ఇవ్వజూపినా పొత్తుకు ముందుకు రాలేదన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు.
‘‘రాహుల్ వ్యాఖ్యన్నీ అబద్ధాలు. అవి కులతత్వ మనస్తత్వాన్ని, దళితుల పట్ల దుర్గార్మపు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీని దిద్దుకోలేక రాహుల్ మాపై వేలెత్తి చూపుతున్నారు’’ అని మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీని సంప్రదించడం దానిపై మాయా మౌనం నిజమేనని కాంగ్రెస్ నేత ఖర్గే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment