చాంద్రాయణగుట్ట: కరెంట్ షాక్‌తో దంపతులు మృతి చెందిన విషాద ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్‌నగర్‌కు చెందిన షాకీరా బేగం(30), తన్వీర్ మజ్జా (36) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. శనివారం ఉదయం మంచినీటి సరఫరా జరుగుతుండడంతో నల్లా మోటార్ స్విచ్ వేయడానికి షాకీరా బయటికి వచ్చింది.
సంప్ ఐరన్ మూతపై నిల్చొని షాకీరా బేగం కరెంట్ స్విచ్ ఆన్ చేసింది. అప్పటికే విద్యుత్ తీగ తేలి ఐరన్ మూతకు ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురైంది. ఇది గమనించిన భర్త తన్వీర్ ఆమెను కాపాడేందుకు వెళ్లడంతో ఆయనకు సైతం షాక్ కొట్టింది.
దంపతులిద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులు బాశారు. అలికిడితో నిద్ర లేచిన పిల్లలు.. తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తీవ్రంగా రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment