UAE TAQA seeks to investment: షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికతో ఇబ్బందుల్లోపడిన అదానీ గ్రూపు ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. వేల కోట్ల రూపాయలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అందుకోనుంది. అదానీకి చెందిన పవర్ కంపెనీ GQG, గోల్డ్‌మాన్ సాచ్స్ పెట్టుబడుల తర్వాత మరో డీల్ సాధించ నుంది. అబుదాబికి చెందిన TAQA అదానీ సంస్థల్లో 2.5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్)
తాజాగా అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ PJSC(TAQA) తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గౌతమ్ అదానీకి చెందిన పవర్ బిజినెస్‌లలో పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. అదానీ గ్రూప్ సంస్థలలో లేదా ఏదైనా ఒక సంస్థలో 1.5-2.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడుల నిమిత్తంTAQA చూస్తోందిన ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక తెలిపింది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ప్రాజెక్టులపై సంయుక్తంగా పనిచేయాలని చూస్తున్నాయని తెలిపింది. ఇవి థర్మల్ ఉత్పత్తి నుండి క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ వరకు వివిధ నిలువు వరుసలలో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ప్రాథమిక ఇన్ఫ్యూషన్ , ప్రమోటర్ ఫ్యామిలీ ఎంటిటీల నుండి షేర్లను సెకండరీ కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సంస్థలలో 19.9 శాతం వరకు వాటాను కొనుగోలు చేయనుంది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం)
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత విలువ రూ. 91,660 కోట్లు, ప్రమోటర్లు 68.28 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం, దాదాపు 20 శాతం వాటా అంటే రూ. 18,240 కోట్ల పెట్టుబడి (2.19 బిలియన్లడాలర్లు) TAQA పెట్టనుంది. అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ (ADX)లో లిస్టెడ్ కంపెనీ TAQA నాలుగు ఖండాల్లోని 11 దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ ఇంధన మరియు నీటి సంస్థ. కాగా గత వారం, ఖతార్ వెల్త్ ఫండ్ ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అనుబంధ సంస్థ 500 మిలియన్ డాలర్ల బ్లాక్ డీల్ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment