సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయ్యింది. కీలక మ్యాచ్‌కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది.
పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చిన కానీ హెచ్‌సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ.. 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్ఈ రాముడు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్‌తో పవర్‌ను సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment