ప్రభుత్వోద్యోగులు కొంతమంది ప్రజలకు సేవలందించే విభాగంలో పనిచేస్తూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కొంతమంది చదువురాక ఎలా అడగలా కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలో అధికారులు చెప్పరు. ఒకేవేళ ఏదోరకంగా ప్రభుత్వానికి తమ మొర చెప్పుకునేందకు దరఖాస్తు చేసుకున్న సత్వరమే సిబ్బంది స్పందించరు. అచ్చం అలానే ఇక్కడొక రైతు ప్రభుత్వాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నిసార్లు ఆ అధికారులు చుట్టు తిరిగి తన మొర వినిపించిని పట్టించుకున్నవాడే లేడు. దీంతో విసిగిపోయిన ఆ రైతు చేశాడంటే!
వివరాల్లోకెళ్తే...కర్ణాటకకు చెందిన ఒక రైతు మసాలు రుబ్బుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి తదితర పనులన్నింటికీ నేరుగా తన ఇంటికి సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇలా అతను పదినెలలుగా చేస్తున్నప్పటికీ అక్కడ అధికారులు నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవడం విచిత్రం. అసలేం జరిగిందంటే... హనుమంతప్ప అనే రైతు ఇంటికి 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా సమయం మంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఐతే వారి చుట్టుపక్కల వాళ్లందరికి కరెంట్ బాగానే ఉంటుంది.
ఆ రైతు మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్) కార్యాలయంలోని అధికారులకు తన సమస్య చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన ఫలితం శూన్యం. అయితే ఒకరోజు మోస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి మసాలాలు రుబ్బుకోవడం, ఫోన్ ఛార్జీంగ్ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రతి రోజు పోరుగింటికి వెళ్లలేనని గట్టిగా చెబుతాడు. దీంతో ఆ అధికారి నేరుగా విద్యుత్ కార్యాలయానికి(మెస్కామ్) వెళ్లే చేసుకోండి అంటూ వ్యగ్యంగా ఒక ఉచిత సలహ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు.
ఇక అప్పటినుంచి ఆ రైతు తన వ్యక్తిగత పనుల కోసం విద్యుత్‌కార్యాలయాన్నే వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో విద్యుత్ శాఖ రైతు వ్యక్తిగత పనులకు విద్యుత్ కార్యాలయాన్ని వాడుకునేందుకు అనుమతిచ్చిన సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది.
అంతేకాదు మెస్కామ్ జూనియర్ ఇంజనీర్ విశ్వనాథ్ భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్‌లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని, అందువల్లే ఆ రైతు ఇంటికి విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఐతే ఆ రైతుకి మల్లాపుర పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ లైన్ తీసి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పారు. అంతేకాదు ఆ రైతు ఇంటికి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తుందని కూడా అధికారులు చెప్పారు.
(చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు)
Comments
Please login to add a commentAdd a comment