Grinding
-
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు: ΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా. చెవి పోటు దవడ కండరాల నొప్పులు కొందరిలో చెవిలో హోరు (టినైటిస్) నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు: అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్: పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు పెద్దవారిలో గురక రావడం. చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరంస్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు. జీవనశైలి అంటే లైఫ్స్టైల్లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్(చదవండి: కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!) -
ఆ రైతు వాడకం మాములుగా లేదుగా...దెబ్బకు దిగివచ్చిన అధికారులు
ప్రభుత్వోద్యోగులు కొంతమంది ప్రజలకు సేవలందించే విభాగంలో పనిచేస్తూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కొంతమంది చదువురాక ఎలా అడగలా కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలో అధికారులు చెప్పరు. ఒకేవేళ ఏదోరకంగా ప్రభుత్వానికి తమ మొర చెప్పుకునేందకు దరఖాస్తు చేసుకున్న సత్వరమే సిబ్బంది స్పందించరు. అచ్చం అలానే ఇక్కడొక రైతు ప్రభుత్వాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నిసార్లు ఆ అధికారులు చుట్టు తిరిగి తన మొర వినిపించిని పట్టించుకున్నవాడే లేడు. దీంతో విసిగిపోయిన ఆ రైతు చేశాడంటే! వివరాల్లోకెళ్తే...కర్ణాటకకు చెందిన ఒక రైతు మసాలు రుబ్బుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి తదితర పనులన్నింటికీ నేరుగా తన ఇంటికి సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇలా అతను పదినెలలుగా చేస్తున్నప్పటికీ అక్కడ అధికారులు నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవడం విచిత్రం. అసలేం జరిగిందంటే... హనుమంతప్ప అనే రైతు ఇంటికి 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా సమయం మంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఐతే వారి చుట్టుపక్కల వాళ్లందరికి కరెంట్ బాగానే ఉంటుంది. ఆ రైతు మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్) కార్యాలయంలోని అధికారులకు తన సమస్య చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన ఫలితం శూన్యం. అయితే ఒకరోజు మోస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి మసాలాలు రుబ్బుకోవడం, ఫోన్ ఛార్జీంగ్ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రతి రోజు పోరుగింటికి వెళ్లలేనని గట్టిగా చెబుతాడు. దీంతో ఆ అధికారి నేరుగా విద్యుత్ కార్యాలయానికి(మెస్కామ్) వెళ్లే చేసుకోండి అంటూ వ్యగ్యంగా ఒక ఉచిత సలహ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇక అప్పటినుంచి ఆ రైతు తన వ్యక్తిగత పనుల కోసం విద్యుత్‌కార్యాలయాన్నే వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో విద్యుత్ శాఖ రైతు వ్యక్తిగత పనులకు విద్యుత్ కార్యాలయాన్ని వాడుకునేందుకు అనుమతిచ్చిన సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది. అంతేకాదు మెస్కామ్ జూనియర్ ఇంజనీర్ విశ్వనాథ్ భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని, అందువల్లే ఆ రైతు ఇంటికి విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఐతే ఆ రైతుకి మల్లాపుర పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ లైన్ తీసి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పారు. అంతేకాదు ఆ రైతు ఇంటికి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తుందని కూడా అధికారులు చెప్పారు. (చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు) -
బ్యూటిప్స్
మెంతికూరను మెత్తగా రుబ్బి తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు మెత్తబడి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గంధంలో పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల త్వరగా మురికి పోవడంతో పాటు ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. ఇందులో చిటికెడు పసుపు కలుపుకొంటే మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు తగ్గుతాయి. జిడ్డు చర్మం ఉన్నవారు... దోస రసం, నిమ్మరసం, పసుపు, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకొని, కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం జిడ్డు, మలినాలను తొలగించి చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. రోజూ ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలకు దూరంగా ఉండడం.. వంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో వేధించే జిడ్డు సమస్య దూరమవుతుంది.