బ్యూటిప్స్
మెంతికూరను మెత్తగా రుబ్బి తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు మెత్తబడి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గంధంలో పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల త్వరగా మురికి పోవడంతో పాటు ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. ఇందులో చిటికెడు పసుపు కలుపుకొంటే మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు తగ్గుతాయి.
జిడ్డు చర్మం ఉన్నవారు... దోస రసం, నిమ్మరసం, పసుపు, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకొని, కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం జిడ్డు, మలినాలను తొలగించి చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. రోజూ ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలకు దూరంగా ఉండడం.. వంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో వేధించే జిడ్డు సమస్య దూరమవుతుంది.