కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి.
లక్షణాలు:
΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా.
చెవి పోటు
దవడ కండరాల నొప్పులు
కొందరిలో చెవిలో హోరు (టినైటిస్)
నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం
నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది.
రకాలు:
అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు
స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం.
రిస్క్ ఫ్యాక్టర్స్:
పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్‌డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు
పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం
పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్‌ఎస్‌ఆర్‌ఐస్ అనే మందులు
పెద్దవారిలో గురక రావడం.
చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరం
స్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు
‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది
కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు.
జీవనశైలి అంటే లైఫ్‌స్టైల్‌లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్
డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్
(చదవండి: కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment