Electricity company
-
‘కరెంటు’లో కూటమి కాసుల వేట
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో కాసులు దండుకొనే ప్రక్రియలో కూటమి నేతలు మరో అంకాన్ని మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బలవంతంగా రాజీనామా చేయించిన డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇప్పటికే డైరెక్టర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఖరారై పోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూలు మొక్కుబడిగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (డిస్కం)ల డైరెక్టర్ల పోస్టులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, ఓ సాంకేతిక నిపుణుడు (మాజీ డైరెక్టర్) ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొత్తం ముడుపుల కోసమేకూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలో గత ప్రభుత్వంలో నియమితులైన 10 మంది డైరెక్టర్ల చేత జూలై 3న బలవంతంగా రాజీనామా చేయించారు. వీరితో పాటు గత నబంబర్లో పదవీకాలం పూర్తయిన ఐదుగురితో కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్ల పోస్టులపై కన్నేసిన కూటమి పెద్దలు.. తమకు ముడుపులిచ్చే వారిని నియమించేందుకు నిబంధనలను మార్చేసుకున్నారు. గత్యంతరం లేక వారికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వారితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా అర్హులేనంటూ నిబంధనలు సవరించేశారు.పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఓ మహిళా అధికారిని హెచ్ఆర్ డైరెక్టర్‌గా కూర్చోబెట్టేందుకు ఆమె మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు మార్చారు. జాయింట్ సెక్రటరీ కేటగిరీకి అర్హత ఇచ్చి, చీఫ్ ఇంజినీర్ కేటగిరీని తీసేశారు. మిగతా పోస్టులకు మాత్రం చీఫ్ ఇంజనీర్ అర్హులేనంటూ ఆదేశాలిచ్చారు. తర్వాత కూటమి పెద్దలు కొందరు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘చినబాబు’ ఓ జాబితాను ఖరారు చేశారని, అందులో ఉన్నవారికే ఈ పోస్టులు కట్టబెడతారని సమాచారం.ఆరంభమే గందరగోళంఏపీ ట్రాన్స్‌కోలో ఫైనాన్స్, టెక్నికల్, ఏపీ జెన్కోలో థర్మల్, ఫైనాన్స్, హెచ్ఆర్, హైడల్, కోల్, ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, ఏపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో ప్రాజెక్ట్స్, టెక్నికల్, ఫైనాన్స్ పోస్టులకు 189 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 167 మందికి రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేశారు. అభ్యర్థులు ఉదయమే సచివాలయానికి చేరుకోగా.. ఇక్కడ కాదు.. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధకు వెళ్లాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ రెండింటికీ మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అంత దూరం ట్రాఫిక్‌ను దాటుకుని విద్యుత్ సౌధను చేరుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వాళ్లు ఆలస్యంగా చేరుకున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు వర్చ్యువల్‌గా హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చారని వారిని అనర్హులను చేసి, మెచ్చిన వారికి పోస్టులు ఇవ్వడం కోసమే ఇలా దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను సోమవారం రాత్రికి పూర్తి చేశారు. మంగళవారం జెన్కో, ట్రాన్స్‌కో, బుధవారం సీపీడీసీఎల్‌లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.డబ్బులు వసూలు చేస్తే ఫోన్ చేసి చెప్పండిడైరెక్టర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఇంధన శాఖ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం మొబైల్ నంబర్ 9490154719కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరింది. -
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి. అదనపు ఖర్చులతో రేటు పెరిగి.. 2017 చివరి నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్‌కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.ట్రాన్స్మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్‌గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి. సరిగా విద్యుత్ సరఫరా లేక.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్‌గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్‌కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి. -
ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్ క్లైంబింగ్) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్, రూల్ మాఫ్ రిజర్వేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ముందస్తు నోటీసులివ్వకపోవడం తప్పే
మంచిర్యాల అగ్రికల్చర్: ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీల వసూలులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ సంస్థ వినియోగదారుల నుంచి వసూలు చేస్తోందని ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వినియోగదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం విద్యుత్ సంస్థ తప్పేనన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు రవాణా, మరమ్మతు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆలస్యమైనప్పుడు సొంతంగా తీసుకొస్తే చార్జీల కింద సంస్థ రూ.700 చెల్లిస్తుందని వెల్లడించారు. -
15,500 మె.వా. విద్యుత్ సరఫరాకు సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ విద్యుత్ డిమాండ్ 15,500 మెగావాట్లకు పెరిగే అవకాశముందని, ఆ మేరకు సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఉదయం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయి లో పెరిగి 14,017 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది డిసెంబర్లో నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 10,935 మెగావాట్లను మించిపోయింది. యాసంగి పంటల కోసం రైతాంగం పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగిస్తుండటంతోనే డిసెంబర్లో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నమోదైన 14,160 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు అత్యధిక రికార్డు కాగా, రానున్న ఫిబ్రవరి, మార్చి రోజుల్లో 15,500 మెగావాట్లకు పెరగనుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు విద్యుత్ సరఫరాకు సిద్ధం కావా లని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొంతమంది రైతులు ఇంకా ఆటో స్టార్టర్లను వినియోగిస్తుండటంతో విద్యుత్ వృథా అవుతోందని, క్షేత్రస్థాయిలో నిరంతరం నిఘా ఉంచి వీటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించారు. -
విద్యుత్ సంస్థల్లో 250 మందికి రివర్షన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 172 మంది ఇంజనీర్లతో పాటు మొత్తం 250 మంది ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలు వారం రోజులుగా చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఒకటì , రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. నెలాఖరులో సుప్రీంకోర్టులో విచారణ.. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకుగాను విద్యుత్ సంస్థల యాజమాన్యాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను అమలు చేసి ఆ మేరకు అఫిడవిట్‌ను సమర్పించాలని, నెలాఖరులోగా మళ్లీ విచారణ నిర్వహిస్తామని.. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులు, వేతన బకాయిలను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి దాదాపు 700 మందిని జస్టిస్ ధర్మాధికారి కమిటీ తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా కొత్తగా పదోన్నతులు కల్పించాలని ధర్మాధికారి కమిటీ సిఫారసు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగుల్లో 250 మంది రివర్షన్లు పొందనున్నట్టు సమాచారం. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం సీనియర్లు ఉండటంతో వారికి పదోన్నతులు లభించనున్నాయి. రివర్షన్లు ఇస్తే ఒప్పుకోం.. తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్లు ఇస్తే అంగీకరించమని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగకుండా సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని వారు డిమాండ్ చేశారు. -
అదానీ ట్రాన్స్మిషన్: 32 శాతం లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ దిగ్గజం అదానీ ట్రాన్స్మిషన్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 289 కోట్లు ఆర్జించింది. అయితే రూ. 138 కోట్ల ఫారెక్స్ నష్టాలు(విదేశీ రుణాలపై ఎంటూఎం సర్దుబాటు) ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో ఇవి రూ. 6 కోట్ల లాభంగా నమోదైనందున ఫలితాలు పోల్చిచూడతగదని వివరించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,675 కోట్ల నుంచి రూ. 3,377 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 223.3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. గత క్యూ2లో 197.5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే విక్రయించింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించింది. నేటి(2) నుంచి ట్రాన్స్మిషన్ బిజినెస్‌కు సీఈవోగా విమల్ దయాల్, పంపిణీ విభాగ సీఈవోగా కందర్ప్ పటేల్‌ను బోర్డు ఎంపిక చేసింది. అనిల్ సర్దానా కంపెనీ ఎండీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. -
కోర్టు ఆదేశాలు జైలుకు పంపాక అమలు చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యుత్తు ఉద్యోగులను కోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ లెక్కింపు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘జైలుకు పంపాక ఆదేశాలు అమలు చేస్తారా?’అని ప్రశ్నించింది. విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు 84 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నామని, బకాయిలు చెల్లించేశామని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరఫు సీనియర్ న్యాయవాదులు గిరి, రంజిత్‌కుమార్, రాకేష్ ద్వివేదిలు కోర్టుకు తెలిపారు. ఆదేశాలు అమలు అయినట్లేగా అని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించగా.. ఉద్యోగుల తరఫు సీ నియర్ న్యాయవాది హరీన్ రావెల్, న్యాయ వాది రాజగోపాలరావులు అభ్యంతరం తెలిపారు. ఏపీ నుంచి విధుల్లోకి తీసుకున్న సీనియర్ల కన్నా తెలంగాణలోని జూనియర్లకు ఎక్కువ వేతనం వస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏపీలో ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారని వివరించారు. అంతర్రాష్ట్ర సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఏమయ్యాయని తెలంగాణ న్యా యవాదులను జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. గతంలోనూ గడువు అడిగారుగా.. పదోన్నతులు కల్పించాలంటే సీనియారిటీ లెక్కబెట్టాలంటూ, ఇందుకు నాలుగు వారాల గడు వు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరఫు న్యాయవాదులు కోరారు. గతంలోనూ నాలుగు వారాలు అడిగారు కదా.. ఇంకా ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వీసు బుక్‌లు అందలేదని, కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని న్యాయవాది గిరి తెలిపారు. దీంతో ఇంకా ఎప్పుడు పాటిస్తారు? జైలు పంపాక పాటిస్తారా? అని జస్టిస్ ఎఆంర్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం.. సర్వీసు బుక్‌లు ఇవ్వాలని ఏపీ విద్యుత్తు సంస్థల్ని ఆదేశించింది. -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ రైతు వాడకం మాములుగా లేదుగా...దెబ్బకు దిగివచ్చిన అధికారులు
ప్రభుత్వోద్యోగులు కొంతమంది ప్రజలకు సేవలందించే విభాగంలో పనిచేస్తూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కొంతమంది చదువురాక ఎలా అడగలా కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలో అధికారులు చెప్పరు. ఒకేవేళ ఏదోరకంగా ప్రభుత్వానికి తమ మొర చెప్పుకునేందకు దరఖాస్తు చేసుకున్న సత్వరమే సిబ్బంది స్పందించరు. అచ్చం అలానే ఇక్కడొక రైతు ప్రభుత్వాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నిసార్లు ఆ అధికారులు చుట్టు తిరిగి తన మొర వినిపించిని పట్టించుకున్నవాడే లేడు. దీంతో విసిగిపోయిన ఆ రైతు చేశాడంటే! వివరాల్లోకెళ్తే...కర్ణాటకకు చెందిన ఒక రైతు మసాలు రుబ్బుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి తదితర పనులన్నింటికీ నేరుగా తన ఇంటికి సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇలా అతను పదినెలలుగా చేస్తున్నప్పటికీ అక్కడ అధికారులు నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవడం విచిత్రం. అసలేం జరిగిందంటే... హనుమంతప్ప అనే రైతు ఇంటికి 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా సమయం మంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఐతే వారి చుట్టుపక్కల వాళ్లందరికి కరెంట్ బాగానే ఉంటుంది. ఆ రైతు మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్) కార్యాలయంలోని అధికారులకు తన సమస్య చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన ఫలితం శూన్యం. అయితే ఒకరోజు మోస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి మసాలాలు రుబ్బుకోవడం, ఫోన్ ఛార్జీంగ్ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రతి రోజు పోరుగింటికి వెళ్లలేనని గట్టిగా చెబుతాడు. దీంతో ఆ అధికారి నేరుగా విద్యుత్ కార్యాలయానికి(మెస్కామ్) వెళ్లే చేసుకోండి అంటూ వ్యగ్యంగా ఒక ఉచిత సలహ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇక అప్పటినుంచి ఆ రైతు తన వ్యక్తిగత పనుల కోసం విద్యుత్‌కార్యాలయాన్నే వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో విద్యుత్ శాఖ రైతు వ్యక్తిగత పనులకు విద్యుత్ కార్యాలయాన్ని వాడుకునేందుకు అనుమతిచ్చిన సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది. అంతేకాదు మెస్కామ్ జూనియర్ ఇంజనీర్ విశ్వనాథ్ భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని, అందువల్లే ఆ రైతు ఇంటికి విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఐతే ఆ రైతుకి మల్లాపుర పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ లైన్ తీసి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పారు. అంతేకాదు ఆ రైతు ఇంటికి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తుందని కూడా అధికారులు చెప్పారు. (చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు) -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో పనులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర డిస్కంతో సమానంగా దక్షిణ డిస్కంలో కాంట్రాక్ట్ పనుల ధరలను సవరించాలని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు. పనుల అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్ఐ, సెస్, కాంట్రాక్టర్ల అలవెన్సులను కలపాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, సంయుక్త కార్యదర్శి సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లుల ఎత్తి‘మోత’లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 2020–21లో 3,575 మిలియన్ యూనిట్లు ఉండగా, 2021–22లో 4,282 ఎంయూలకు పెరిగింది. 2022–23లో వీటికి ఏకంగా 13,826 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదిక–2022–23లో స్పష్టం చేశాయి. మరోవైపు రూ.5,652 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఈ సబ్సిడీ, ఎత్తిపోతల పథకాల బిల్లులు కలిపి 2022–23లో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.13,312 కోట్లను చెల్లించాల్సి ఉండనుంది. దక్షిణ డిస్కంలో ఇలా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,617 ఎంయూల విద్యుత్ వినియోగించగా, 2021–22లో 13 శాతం అదనంగా 1,830 ఎంయూలను వినియోగించాయి. కాగా 2022–23లో ఏకంగా 190 శాతం అదనంగా 5,325 ఎంయూల విద్యుత్ వినియోగించనున్నాయని దక్షిణ డిస్కం అంచనా వేసింది. 2021–22లో ఎత్తిపోతల పథకాల బిల్లుల ద్వారా రూ.1,211.89 కోట్లను సంస్థ ఆర్జించగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.21,820.56 కోట్లలో ఇది 5 శాతం ఉంటుందని అంచనా. 2022–23లో రూ. 2,505.05 కోట్లను ఆర్జించనుండగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.24,610.33 కోట్లలో ఎత్తిపోతల బిల్లుల వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఉత్తర డిస్కం పరిస్థితి ఇదీ.. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,958 ఎంయూల విద్యుత్‌ను వాడగా, 2021–22లో 25 శాతం వృద్ధితో 2,452 ఎంయూలు వినియోగించాయి. 2022–23లో ఏకంగా 246 శాతం వృద్ధితో 8,501 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని ఉత్తర డిస్కం అంచనా వేసింది. సంస్థకు 2021–22లో రూ.7,175 కోట్ల వార్షిక ఆదాయం అంచనా కాగా, అందులో రూ.1,646 కోట్ల (23 శాతం)ను ఎత్తిపోతల విద్యుత్ బిల్లుల రూపంలో ఆర్జించనుంది. 2022–23లో సంస్థకు రూ.10,703 కోట్ల వార్షిక ఆదాయం రానుందని అంచనాలుండగా, అందులో ఏకంగా రూ.5,155 కోట్లు (48శాతం) ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల రూపంలో రానున్నాయి. -
దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకమైనదని ఆ సంస్థ సీజీఎం(ఐటీ) శైలేష్ శ్రీనివాసన్ అన్నారు. 46 ఏళ్ల ప్రస్థానంలో నిరంతర విద్యుత్ సరఫరాతో ఎన్టీపీసీ దేశంలో స్ఫూర్తిదాయక సంస్థగా కొనసాగుతుందన్నారు. సంస్థ సదరన్ రీజియన్ క్వార్టర్స్‌లో ‘ఎన్టీపీసీ రైజింగ్‌డే –2021’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శైలేష్ శ్రీనివాసన్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. కరోనా విజృంభించిన సమయంలోనూ సంస్థ మంచి పనితీరును కనబరించిందని కితాబిచ్చారు. దక్షిణ ప్రాంతంలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు, సోలార్ పీవీ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అనం తరం ‘హిందీ పక్వాడా’, ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం మణికాంత్ పాల్గొన్నారు. -
11 ‘విద్యుత్’ ఒప్పందాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య జరిగిన 11 పాత, కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సుమోటోగా ఆమోదించింది. జెన్కో కొత్తగా నిర్మించిన/నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల కేటీపీఎస్–7వ దశ, 600 మెగావాట్ల కేటీపీపీ–2, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో సంస్థకు చెందిన ఇతర పాత విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ ఆవిర్భావం తర్వాత డిస్కంలు పీపీఏలను కుదుర్చుకున్నాయి. విద్యుత్ చట్టం–2003 నిబంధనల ప్రకారం ఈ పీపీఏలను ఈఆర్సీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఏలపై బహిరంగ విచారణ నిర్వహించి వివిధ వర్గాల నుంచి సలహాలను ఈఆర్సీ స్వీకరించింది. అనంతరం పలు మార్పులతో పీపీఏలను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గడువు తీరిన పీపీఏల స్థానంలో కొత్త ఒప్పందాలు 1956 నుంచి 1998 మధ్య పాత థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జరిగిన పీపీఏల వ్యవధి 2019లో ముగిసింది. దీంతో 400 మెగావాట్ల కేటీపీఎస్ ఏబీసీ, 500 మెగావాట్ల కేటీపీఎస్–5వ దశ, 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్ స్టేషన్–బీ, 875.6 మెగావాట్ల నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం, 54 మెగావాట్ల సింగూరు/పోచంపాడు/పాలేరు/నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రాలు, 9.16 మెగావాట్ల పెద్దపల్లి జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు జెన్కోతో కొత్త పీపీఏలు చేసుకున్నాయి. ఈ పీపీఏలను సైతం ఈఆర్సీ తాజాగా ఆమోదించింది. యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై అభ్యంతరాలు నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం భారీగా పెరిగిపోతోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణవ్యయం రూ. 30 వేల కోట్లకు పెరగనుందని జెన్కో అంచనా వేసింది. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం సైతం రూ. 8,536 కోట్లకు పెరగనుందని ఈఆర్సీకి తెలిపింది. 800 మెగావాట్ల కేటీపీఎస్– 7వ దశ నిర్మాణానికి రూ. 5,548.44 కోట్లు, 600 మెగావాట్ల కేటీపీపీ–2కు రూ. 4,334 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరగడంపట్ల వాటి పీపీఏలపై ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూసేకరణ, పునరావాసం కోసం రూ. 845 కోట్లు, ప్రాజెక్టు ప్రదేశానికి యంత్ర పరికరాలను తరలించడం, అమర్చడం వంటి పనుల కోసం రూ. 1,617 కోట్లు, సివిల్ వర్క్స్ కోసం రూ. 5,057 కోట్లు, కంటిజెన్సి కింద రూ. 201 కోట్లను జెన్కో అనవసరంగా ఖర్చు చేసిందని, ఈ వ్యయాలను అనుమతించరాదని ఈఆర్సీని కోరారు. నిబంధనల మేరకే ఖర్చులు చేసినట్లు జెన్కో సమర్థించుకోగా విద్యుత్ కేంద్రాల నిర్మా ణం పూర్తయ్యాక రానున్న వాస్తవ వ్యయంపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ పేర్కొంది. -
ఆ విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య నియమితులైన ఉద్యోగులకు శుభవార్త! వీరికి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)కి బదులు సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్) పథకాన్ని వర్తింపజేసేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు పూర్తి చేశాయి. విద్యుత్ కార్మిక సమ్మె పిలుపు విరమణ కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీఈటీయూఎఫ్)కు 2016 జూన్‌లో విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చిన పలు హామీల్లో జీపీఎఫ్ అమలు ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో నియమితులైన 4,717 మంది విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు ద్వారా విద్యుత్ సంస్థలపై పడే ఆర్థిక భారంపై ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో ట్రాన్స్‌కో యాజమాన్యం అధ్యయనం జరిపించింది. జీపీఎఫ్ అమలు చేస్తే విద్యుత్ సంస్థలపై రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని కన్సల్టెన్సీ నివేదించింది. పెన్షన్ల చెల్లింపులకు రూ.1,068.17 కోట్లు, గ్రాట్యుటీకి రూ.175.49 కోట్లు కలిపి మొత్తం రూ.1,243.66 కోట్ల భారం పడనుందని తేల్చింది. ప్రస్తుతం ఉన్న గ్రాట్యుటీ ట్రస్ట్ నుంచి రావాల్సిన రూ.175.49 కోట్లు, ఈపీఎఫ్ నుంచి రావాల్సిన రూ.275.95 కోట్ల నిధులను సర్దుబాటు చేస్తే తుదకు రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని లెక్కగట్టింది. ఆ విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ పథకాన్ని వర్తింపజేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ట్రాన్స్‌కోలో 163 మంది, జెన్కోలో 1,304 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,636 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 1,614 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. -
తాత్కాలిక కొలువుల పందేరం!
♦ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట అడ్డగోలు నియామకాలు ♦ కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్లుగా ఇంజనీర్లకు ఉద్యోగాలు ♦ నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా నేరుగా ఉత్తర్వులు ♦ జీతాలు నేరుగా చెల్లిస్తుండటంతో భవిష్యత్తులో క్రమబద్ధీకరించే అవకాశం ♦ ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో దొడ్డిదారిలో 50 మందికిపైగా కొలువులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటన లేదు.. ఏ పరీక్షా లేదు.. రిజర్వేషన్లు అంతకన్నా లేవు.. రోస్టర్ పాయింట్ల లేనే లేవు. అసలు నిబంధనల ఊసే లేదు.ఉన్నత స్థాయిలో పైరవీలతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట దొడ్డిదారిలో కొలువులు ఇస్తున్నారు. కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమిస్తున్నారు. 50 మంది నియామకం.. విద్యుత్ సౌధ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ప్రధాన కార్యాలయాల పరిధిలో ఇప్పటి వరకు 50 మంది ఇంజనీర్లను కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రుల సిఫారసుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. జెన్కోలో 30 మందికి, ట్రాన్స్‌కోలో 20 మందికి టెక్నికల్ అసిస్టెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది. వీరిలో కొందరిని 6 నెలలు, మరికొందరిని ఏడాది కాలానికీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ.. కాలపరిమితి తీరిన ప్రతీసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను సైతం ఖాతరు చేయకుండా నియామకాలు చేసేశారు. నియామకాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో.. వేతనాలను సైతం అంతే అశాస్త్రీయంగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు ఒకేలా ఉన్నా.. సిఫారసు చేసిన నేతల స్థాయినిబట్టి జీతాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు సిఫారసు చేస్తే.. గరిష్టంగా రూ.35 వేలు.. మిగిలిన వారికి రూ.30 వేలు, రూ.25 వేలు, కనిష్టంగా రూ.20 వేల జీతం నిర్ణయించారు. తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలు చెల్లిస్తుండడం అనుమానాలు కలిగిస్తోంది. పెద్ద పోస్టుల భర్తీలోనూ విద్యుత్ సంస్థలు ప్రతిభకు పాతరేశాయి. ఇటీవల తెలంగాణ జెన్కో కాంట్రాక్టు లా ఆఫీసర్ పేరుతో ఓ న్యాయవాదిని ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేకుండా నేరుగా నియమించడం గమనార్హం. ఒకవైపు ఏఈ, సబ్ ఇంజనీర్ల నియామకాల కోసం విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తాత్కాలిక పద్ధతుల్లో ఇంజనీర్లను నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఏఈ, ఎస్ఈల రిక్రూట్మెంట్లలో సైతం పైరవీలకు ఆస్కారముందని, కొందరు ఇప్పటికే వసూళ్లకు తెరలేపడంతో ఇటీవల విద్యుత్ శాఖ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు(జీవో ఎంఎస్ నం.94) ♦ రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యేక రోస్టర్‌ను మెయింటెయిన్ చేయాలి. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ రెగ్యులర్ నియామకాలు జరిపే నియామక సంస్థే కాంట్రాక్టు నియామకాలకు బాధ్యత వహించాలి. ఉద్యోగ నియామక ప్రకటన జారీతో పాటు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాలి.