Updates..
► కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. అందుకే మా పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ చర్యలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది.
►పేదలు, బడుగు, బలహీన వర్గాల తరఫున ప్రశ్నిస్తాం. బీఆర్‌ఎస్ సర్కార్‌పై శాంతియుతంగా యుద్దం చేస్తాం.
► అనంతరం.. వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.
► కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపిన పోలీసులు.
► ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకు?. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చిన నిధులేవి?. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు.
► ఇలాంటి అణిచివేత ధోరణి మంచిది కాదు. కేంద్రమంత్రిగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించే హక్కు కిషన్‌రెడ్డికి లేదా?. కిషన్‌రెడ్డితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకుకెళ్తాం అని అన్నారు.
► కిషన్ రెడ్డి కారులోనే ఆయనను పోలీసు స్టేషన్‌కు తరలింపు.
► కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. తన వాహనంలో ఆయనను కూర్చోబెట్టేందుకు పోలీసులు యత్నించారు. కారులో కూర్చునేందుకు కిషన్‌రెడ్డి నిరాకరించారు.
► ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను చంపేయండి. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కచ్చితంగా బాట సింగారం వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు.
► నేనేమైనా ఉగ్రవాదినా?.. టెర్రరిస్టునా?. నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
► బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
► పోలీసులతో కిషన్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.
► రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
► శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాట సింగారం వెళ్తున్న కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ సహా బీజేపీ నేతలు వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సర్కార్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
► అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక, ఛలో బాట సింగారం నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్‌తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
► మరోవైపు.. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్‌లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్‌ఎస్‌కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు?. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపేవరకు ఉద్యమం ఆగదు. గొప్పగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తే అక్రమ అరెస్ట్‌లు ఎందుకు?. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
► మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావును తార్నాకలోని నివాసంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఆగిపోయాయో చూడడానికే మేము వెళ్తున్నాము. మేము ఇళ్లను చూడడానికి వెళ్లకూడదా?. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లను ఆయన ఖండించారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
► అధికార బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, పలువు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్‌ను కలవలేదు.. భవానీ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment