గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు | Telangana HC Disqualified Gadwal MLA Bandla Krishna Mohan Reddy | Sakshi
Sakshi News home page

గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

Published Thu, Aug 24 2023 3:17 PM | Last Updated on Thu, Aug 24 2023 4:50 PM

Telangana HC Disqualified Gadwal MLA Bandla Krishna Mohan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్‌ తలిగింది. గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ధర్మవరపు కొట్టం అరుణ..  2004 నుంచి 2018 మధ్య మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా పని చేశారు. 1999లో కాంగ్రెస్‌ తరపున గద్వాల నుంచి పోటీ చేసి ఓడారామె. 2004లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి నెగ్గిన ఆమె.. ఆపై కాంగ్రెస్‌లో చేరారు.  ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రోశయ్య హయాంలోనూ మంత్రిగా పని చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన బంధువు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆమె కృష్ణమోహన్‌రెడ్డిని ఓడిచడం గమనార్హం. 2019లో బీజేపీలో చేరిన ఆమె.. సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌  స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ అధిష్టానం ఆమెను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది. 

తాజాగా ఈ మధ్యే కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.

అందుకే వరుసగా.. 
తెలంగాణ హైకోర్టు ఈ మధ్య వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. మంత్రుల కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కేసులతో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. 


అనర్హత కేసుల్లో.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్‌, ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌, హుస్నాబాద్ సతీశ్‌, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్‌, కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్‌, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్‌, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్‌, మల్కాజిగిరి మైనంపల్లి హన్మంత్‌, వికారాబాద్ మెతుకు ఆనంద్‌, నాంపల్లి జాఫర్ హుస్సేన్‌, పటాన్ చెరువు మహిపాల్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement