
హైదరాబాద్: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై డీకే అరుణ స్పందించారు.
ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టం అని డీకే అరుణ అన్నారు.
మీడియా వారు కనీసం తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరికాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్‌లో తన చేరిక పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా?
Comments
Please login to add a commentAdd a comment