సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment