
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లే ముఖంలేక, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశంలో 4 గంటలు కూర్చోబెట్టి, 4 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారనడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? అని అరుణ ప్రశ్నించారు.
రాష్ట్రంలో 57 ఏళ్లు వయసు నిండిన 10 లక్షల మందికి కొత్తగా నెలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం గప్పాలు కొడుతున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నాలుగేళ్లుగా అమలు చేయకుండా, ఇప్పుడు ఉపఎన్నికలు వస్తాయన్న భయంతో ప్రకటించారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రావడం లేదని, ప్రభుత్వ సిబ్బందికి ప్రతి నెలా 15 తర్వాత జీతం ఇస్తున్నారని అరుణ ధ్వజమెత్తార