సాక్షి, హైదరాబాద్: బీజేపీ కొత్త నేతల్లో కొందరు రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కూడా ఆ బాటలో ఉన్నట్టు కనిపిస్తోందని నేతలు అంటున్నారు. బీజేపీ తరఫున గద్వాల నుంచి పోటీ చేస్తానన్న ఆమె ఇటీవల మాట మార్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న అంతర్గత సమాచారంతో పోటీపై వెనక్కి తగ్గారని.. గద్వాల నుంచి బీసీ అభ్యర్థి ని నిలబెడితే పూర్తి మద్దతు ఇచ్చి గెలిపిస్తానంటున్నారని పేర్కొంటున్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుబడితే.. తన తల్లిగారి ప్రాంతమైన నారాయణపేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారని.. దీనిని ఆ నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.
ఈ క్రమంలోనే డీకే అరుణ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటూ.. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా చివరి నిమిషంలో బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో మక్తల్ లేదా నారాయణపేట సీటు అడుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇదే జరిగితే మహబూబ్‌నగర్ జిల్లాలో జితేందర్‌రెడ్డి మినహా గట్టి నాయకుడు ఎవరూ లేకుండాపోతారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment