
బతుకమ్మ పండుగకు సోనియాను ఆహ్వానించాలి
ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్
ఉత్సవాల్లో అందరినీ భాగస్వాములను చేయాలి
టీఆర్‌ఎస్ పాలనలో అన్నీ వైఫల్యాలలే..
హైదరాబాద్: బతుకమ్మ పండుగను కేసీఆర్ కుటుంబ వ్యవహారంలా కాకుండా అన్ని రాజకీయ పార్టీల నేతలను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్‌లో విపక్షాల నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బతుకమ్మ పండుగకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిం చాలని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాల సమీక్షకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ వంద రోజుల పాలనలో సాధించిన ప్రగతి ఏమీ లేదని, అన్నీ వైఫల్యాలే కన్పిస్తున్నాయని విమర్శించారు.
మెదక్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలంతా అక్కడే మకాం వేసి ప్రచారం చేశారంటే రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వాస్తవాలు మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై అవాకులు చెవాకులు మానుకోవాలని సూచించారు. కాగా, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో జరిగిన ఆయిల్‌ఫెడ్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడు తూ రైతులను దగా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెం బర్ 17న ప్రభుత్వమే నిర్వహించాలని పొంగులేటి కోరారు.