ఆయన గద్వాల్‌పై వివక్ష చూపుతున్నారు: డీకే | DK Aruna comments on the TRS Government | Sakshi
Sakshi News home page

ఆయన గద్వాల్‌పై వివక్ష చూపుతున్నారు: డీకే

Published Thu, Aug 18 2016 6:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆయన గద్వాల్‌పై వివక్ష చూపుతున్నారు: డీకే - Sakshi

ఆయన గద్వాల్‌పై వివక్ష చూపుతున్నారు: డీకే

కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్, గద్వాల్ పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ప్రజల ఆక్షాంక్షను క్యాబినేట్ సబ్ కమిటీలో స్పష్టంగా చెప్పామన్నారు. అన్నివనరులు , భౌగోళిక అనుకూలతలు గద్వాలకు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏ గైడ్‌లైన్స్ ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కొత్త ఏర్పాటు చేయబోయే 17 జిల్లాల్లో గద్వాల పేరు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం గద్వాల కేంద్రంగా ఆలంపూర్, మక్తల్ నియోజకవర్గాలతో కలిపి జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఆల్ పార్టీ మీటింగ్‌లో నైనా గద్వాల జిల్లాపై ప్రకటన చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement