ఆఖరికి బిచ్చమెత్తుకుంటాం కానీ టీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం వెళ్లబోమని కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. తాను రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటానని అన్నారు.
హైదరాబాద్: ఆఖరికి బిచ్చమెత్తుకుంటాం కానీ టీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం వెళ్లబోమని కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. తాను రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటానని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు టీఆర్ ఎస్ పార్టీ తిలోదకాలిస్తోందని అన్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రామ్మోహన్‌రెడ్డి తో వెంటనే రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో విలువలున్న నేత తమ తండ్రి నర్సిరెడ్డి అని, రామ్మోహన్ రెడ్డి నిర్వాకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోంది. తనకు తన తండ్రి ఆశయాలకు రామ్మోహన్ రెడ్డి మచ్చతెచ్చారని అన్నారు. నియోజకవర్గం లో కార్యకర్తలెవరూ కూడా రామ్మోహన్ వెంట వెళ్ళలేదని అన్నారు.